కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్‌కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడం అతడి అభిమానులకు తీరని వేదన మిగిల్చేదే. కేజీఎఫ్ మూవీతో యశ్ రేంజ్ మారిపోయింది కానీ.. లేకుంటే శాండిల్‌వుడ్లో పునీతే నంబర్ వన్ హీరో అని చెప్పొచ్చు. ఆ స్థాయి హీరో మంచి ఫాంలో ఉండగా.. 46 ఏళ్లకే కన్నుమూయడం మామూలు షాక్ కాదు.
చివరగా యువరత్న సినిమాతో పలకరించిన పునీత్.. ఈ మధ్యే ద్విత్వ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. లూసియా, యుటర్న్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ డైరెక్షన్లో కేజీఎఫ్ నిర్మాతలు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. ఈ చిత్రంతో పునీత్ రేంజే మారిపోయేదన్న అంచనాలున్నాయి అభిమానుల్లో. కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి ముందే పునీత్ వెళ్లిపోయాడు. ఈ సినిమాను పూర్తిగా ఆపేయడమో.. లేక వేరే హీరోతో తీయడమో చేయొచ్చు.
ఐతే పునీత్ మళ్లీ స్క్రీన్ మీద కనిపించడనేమీ లేదు. అతడి సినిమా ఒకటి చివరి దశలో ఉంది. అదే.. జేమ్స్. దీని షూటింగ్ కొంచెమే మిగిలుంది. పునీత్ అయితే తన వరకు టాకీ పార్ట్ అంతా పూర్తి చేసేశాడట. ఇంకేవైనా సన్నివేశాలు మిగిలున్నా వాటిని పక్కన పెట్టేయడమే. పునీత్‌తో సంబంధం లేని సన్నివేశాలుంటే పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేయడం ఖాయం. కాకపోతే పునీత్‌కు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది.
ఇలా పునీత్ సినిమాలో అతడి పాత్రకు వేరొకరి గొంతు వినిపించడం ఏదోలా ఉంటుంది. కానీ పునీత్ నటించిన చివరి సినిమాను అలా వదిలేయలేరు కాబట్టి, అభిమానులకు చివరగా పునీత్‌ను వెండితెరపై చూసుకోవడానికైనా దీన్ని రిలీజ్ చేయడం పక్కా. బహుశా వచ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టిన రోజు నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చని శాండిల్ వుడ్ మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on October 31, 2021 11:35 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…