Movie News

పునీత్ పాత వీడియోలు వైరల్

కన్నడ సూపర్ స్టార్లలో ఒకడై పునీత్ రాజ్ కుమార్.. తన కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తి శుక్రవారం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం అభిమానులకు చాలా చాలా కష్టమవుతోంది. కొన్ని గంటలు పాటు షాక్‌లో ఉండిపోయిన ఫ్యాన్స్.. తర్వాత కొంచెం తేరుకుని తమ అభిమాన కథానాయకుడికి సంబంధించి మధుర జ్ఞాపకాల వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

నిన్నట్నుంచి పునీత్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా.. ఒక సినిమాలో భాగంగా విధి రాత గురించి పునీత్ చెప్పిన డైలాగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా తిరుగుతోంది. “భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవ్వరూ మార్చలేరు”.. ఇదీ ఆ వీడియో సారాశం. ఇలా తన చిత్రాల్లో పునీత్ చెప్పి లైఫ్ ఫిలాసఫీలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇంకోవైపు తన నుంచి చివరగా విడుదలైన ‘యువరత్న’ సినిమా ప్రమోషన్ల టైంలో అభిమానుల్లో మీడియా ముందు బైట్స్ ఇస్తుంటే.. వెనుక నుంచి వచ్చి వాళ్లను పునీత్ సర్ప్రైజ్ చేసిన వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా తిరుగుతోంది. అభిమానులతో పునీత్ ఎంత ప్రేమగా వ్యవహరిస్తాడో చెప్పడానికి దీన్ని రుజువుగా చూపిస్తున్నారు. ఇక పునీత్ చివరగా కనిపించిన ఈవెంట్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. చనిపోవడానికి ముందు రోజు రాత్రి అతను కన్నడ లెజెండరీ సంగీత దర్శకుడు గురుకిరణ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అందులో ఉపేంద్ర, గణేష్ తదితరులతో కలిసి గురుకిరణ్ కంపోజ్ చేసిన క్లాసిక్ సాంగ్స్ ఆలపించాడు. అందులో పునీత్ ఎంతో సంతోషంగా, హుషారుగా కనిపించాడు.

అలాగే దీని కంటే ముందు అతను పాల్గొన్న చివరి సినిమా ఈవెంట్ తన అన్నయ్య శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘జై భజరంగి’కి సంబంధించినదే. అందులో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్, శివరాజ్‌లతో కలిసి అతను సందడి చేశాడు. స్టేజ్ మీద ముగ్గురూ కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఇక పునీత్ జిమ్‌లో వర్కవుట్లు చేస్తూనే గుండెపోటుకు గురైన నేపథ్యంలో అతడి ఫిట్నెస్ వీడియోలను కూడా అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

This post was last modified on October 30, 2021 3:26 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

54 minutes ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

1 hour ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

2 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

3 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago