మాస్ రాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు సుధీర్ వర్మ సినిమా తీయాలని ఎప్పుట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్ల కిందటే వీరి కలయికలో సినిమా రావాల్సింది. ఒక టైంలో ఈ కాంబినేషన్లో సినిమా ఖరారైందని.. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అని వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది.
‘కేశవ’ తర్వాత మాస్ రాజాతో సినిమా చేయాల్సిన సుధీర్.. అనుకోకుండా ‘రణరంగం’ సినిమాను మొదలుపెట్టాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ కొరియన్ మూవీ ఆధారంగా సాగే లేడీ ఓరియెంటెడ్ ఫిలింని డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా రవితేజ-సుధీర్ కాంబినేషన్లో సినిమా గురించి ప్రకటన రాబోతుండటం విశేషం. ఆదివారం ఈ ప్రాజెక్టు గురించి పెద్ద అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుధీర్ వర్మ అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ మాస్ రాజా 70వ చిత్రానికి సుధీరే దర్శకుడన్నది మాత్రం ఖరారు. రేపటి అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి నేటి అప్‌డేట్‌ను స్వయంగా సుధీర్ వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఎగ్జైట్ అవడం చూస్తే ఈ సినిమాకు దర్శకుడు అతనే అన్నది పక్కా. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా.. రవితేజ సొంత నిర్మాణ సంస్థ ‘ఆర్.టి.టీమ్ వర్క్స్’ కూడా భాగస్వామి కానుంది.
ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో ఘనవిజయాన్నందుకున్నాక రవితేజ మంచి ఊపుమీదున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పూర్తి చేసి ఒకటికి రెండు చిత్రాలను పట్టాలెక్కించాడు. అందులో ఒకటైన.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంకోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎప్పట్నుంచో అనుకుంటున్న సినిమా కూడా గత నెలలోనే సెట్స్ మీదికి వెళ్లింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుధీర్ వర్మతో మాస్ రాజా సినిమా గురించి ప్రకటన రాబోతోంది.
This post was last modified on October 30, 2021 1:22 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…