పునీత్ రాజ్‌కుమార్ తెలుగువాడు కాదు. తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ అతడి హఠాన్మరణంతో తెలుగు వాళ్లు కూడా తమ వాడిని కోల్పోయినంత ఆవేదన చెందుతున్నారు. నటుడిగానే కాక వ్యక్తిగా అతడికున్న మంచి పేరుకు తోడు.. తెలుగు వారితో అతడికున్న పరోక్ష బంధం అందుకు ముఖ్య కారణం.
బెంగళూరుతో తెలుగు వారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వెళ్లి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక చిత్తూరు, కడప, అనంతపురం లాంటి జిల్లాల వాళ్లకైతే బెంగళూరుతో, కర్ణాటకతో అనుబంధం మరింత ఎక్కువ.
కన్నడలో టాప్ స్టార్‌గా పునీత్ గురించి, అతడి సినిమాల గురించి వాళ్లందరికీ బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగా అతడి సినిమాలను అనుసరిస్తున్నారు. అతణ్ని వ్యక్తిగానూ దగ్గర్నుంచి చూస్తున్నారు. అందుకే పునీత్ చనిపోతే మన హీరో ఒకడు పోయిన బాధ వాళ్లందరినీ వెంటాడుతోంది.
ఇదిలా ఉంటే.. సినిమాల పరంగా కూడా పునీత్‌కు తెలుగుతో మంచి కనెక్షన్ ఉంది. హీరోగా అతడి తొలి చిత్రం అప్పును డైరెక్ట్ చేసింది మన పూరి జగన్నాథే కావడం విశేషం. తెలుగులో పూరి సెన్సేషనల్ హిట్ ఇడియట్‌కు మాతృక ఈ చిత్రం. ముందు అక్కడే అప్పు పేరుతో ఈ సినిమా తీసి సూపర్ హిట్ అందించాడు పునీత్‌కు పూరి. అప్పట్నుంచి పునీత్‌కు అప్పు అనేది మరో పేరుగా మారింది. తర్వాత తెలుగులో పూరి ఆంధ్రావాలా సినిమా తీస్తుండగా.. అదే స్క్రిప్టుతో ఆయన శిష్యుడు మెహర్ రమేష్.. పునీత్‌ను పెట్టి వీర కన్నడిగ తీశాడు. తెలుగు వెర్షన్ డిజాస్టర్ అయినా.. వీర కన్నడిగ మాత్రం సూపర్ హిట్ కావడం విశేషం.
ఆ పై పునీత్.. ఒక్కడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు లాంటి తెలుగు బ్లాక్‌బస్టర్ల రీమేక్ చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ సహా చాలామంది తెలుగు స్టార్లతో అతడికి మంచి అనుబంధం ఉంది. తారక్ అతడి కోసం ఓ సినిమాలో గెలాయా గెలాయా అనే పాట కూడా పాడటం విశేషం. కొన్ని నెలల కిందటే యువరత్న సినిమాతో నేరుగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన పునీత్.. ఇకపై తన ప్రతి సినిమానూ తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది.
This post was last modified on October 30, 2021 6:13 am
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదాన్ని బీజేపీ మహిళా నేత, సినీ…
కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు.…
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు…
ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో…
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా…
పట్టుబట్టారు.. సాధించారు. ఈ మాటకు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ సహా.. నారా లోకే ష్ కూడా…