కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు పునీత్ రాజ్ కుమార్. అక్కడ అభిమానులు ఆయన్ను ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఫిజికల్ గా ఎంతో ఫిట్ గా ఉండే ఈ స్టార్ హీరో హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం అభిమానులను షాక్ కు గురిచేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా.. మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందట. వెంటనే ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కి తరలించారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పునీత్ హెల్త్ స్టేటస్ పై అప్డేట్ ఇవ్వమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ లో పునీత్ ఫ్యామిలీతో పాటు హీరో యష్, నటి శృతి, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉన్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికొస్తే.. పునీత్ చివరిగా సంతోష్ ఆనంద్రమ్ డైరెక్ట్ చేసిన ‘యువరత్న’ సినిమాలో కనిపించారు. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం పునీత్.. ‘జేమ్స్’, ‘ద్విత్వ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.
This post was last modified on October 29, 2021 3:27 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…