సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో చేరారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఆయన తిరిగొచ్చిన వెంటనే బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం సడెన్ గా ఆయన్ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళలకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై రజినీకాంత్ భార్య లతా స్పందించారు.
రజినీకాంత్ ఎప్పటిలానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మొద్దని.. అభిమానులను టెన్షన్ పడొద్దని చెప్పారు. నిజానికి కొన్ని గంటల తరువాత ఆయన ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు.
కానీ శుక్రవారం నాడు పూర్తిగా డాక్టర్ల అబ్సర్వేషన్ లో ఉండాలని హాస్పిటల్ వర్గాలు చెప్పడంతో అక్కడే ఉంచేశారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారనే ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు వచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
This post was last modified on October 29, 2021 11:28 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…