Movie News

రజినీ సినిమా.. రెండు క‌ళ్లూ చాల‌ట్లా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ నుంచి స‌రైన సినిమా కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్లు కోరుకునే సినిమాలాగే క‌నిపిస్తోంది అన్నాత్తె. తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన టీజ‌ర్, పాట‌లు చాలా క‌ల‌ర్ ఫుల్‌గా, మాస్-ఫ్యామిలీ ఆడియ‌న్స్ మెచ్చేలా క‌నిపించాయి.

ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ కూడా లాంచ్ చేశారు. అది కూడా చాలా క‌ల‌ర్ ఫుల్‌గానే సాగింది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమా నుంచి ప్రేక్ష‌కులు ఆశించే అన్ని అంశాలూ ఇందులో ఉన్న‌ట్లే క‌నిపించాయి. కాస్టింగ్ ద‌గ్గ‌ర్నుంచి మేకింగ్ వ‌ర‌కు భారీతనానికి కేరాఫ్ అడ్ర‌స్‌లాగా క‌నిపించిందీ సినిమా. మామూలుగా ర‌జినీ సినిమాలో ఆయ‌నే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉంటారు. ఇందులోనూ ఆయ‌న ఆక‌ర్ష‌ణ‌కేమీ లోటు లేదు. కానీ ఆయ‌న‌తో పాటు ఆర్టిస్టుల ప‌రంగా ప్యాడింగ్ చాలా గ‌ట్టిగానే చేయ‌డం విశేషం.

ర‌జినీకి జోడీగా న‌య‌న‌తార‌.. ఆయ‌న చెల్లెలిగా కీర్తి సురేష్‌.. వీళ్లిద్ద‌రూ చాల‌ద‌న్న‌ట్లు నిన్న‌టి త‌రం తార‌లు మీనా, ఖుష్బూ.. ఇలా ర‌జినీ చుట్టూ పేరున్న లేడీ క్యారెక్ట‌ర్లు చాలానే ఉన్నాయి. మ‌రోవైపు విల‌న్ గ్యాంగ్ కూడా చాలా పెద్ద‌దే ఇందులో.

మెయిన్ విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు భీక‌ర‌మైన అవ‌తారంలో క‌నిపిస్తున్నారు. అంతే కాక ప్ర‌కాష్ రాజ్ లాంటి దిగ్గ‌జ న‌టుడు కూడా నెగెటివ్ రోల్ చేశాడు. న‌ర‌సింహా సినిమాలో క‌లిసి న‌టించాక 21 ఏళ్ల‌కు ర‌జినీ, ప్ర‌కాష్ రాజ్ క‌లిసి తెర‌పై క‌నిపించ‌నున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇంకా గ‌బ్బ‌ర్ సింగ్ విల‌న్ అభిమ‌న్యు సింగ్ కూడా ఉన్నాడు. ఇక కామెడీ పరంగా కూడా సందడి తక్కువేమీ కాదు. తమిళంలో టాప్ కమెడియన్లయిన సూరి, సతీష్, ఇంకా కొంతమంది రజనీ పక్కనే ఉండి కావాల్సినన్ని పంచులు వేసేలా కనిపిస్తున్నారు.

మొత్తంగా ఈ తారాగణం కోసమే ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చేలా ఉంది. రజినీ సినిమాలో ఈ స్థాయిలో స్టార్ కాస్ట్ ఉండటం అరుదైన విషయమే. ఇక ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా ప్రతి రసమూ బాగానే దట్టించినట్లున్నాడు దర్శకుడు శివ. సాంకేతిక ఆకర్షణలు, భారీతనానికీ లోటు లేదు. సూపర్ స్టార్‌కు ఒక భారీ విజయం చాలా అవసరమైన నేపథ్యంలో దర్శకుడు శివ ప్యాడింగ్ చాలా గట్టిగా చేసుకున్నట్లున్నాడు.

This post was last modified on October 29, 2021 7:39 am

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

36 minutes ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

39 minutes ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

6 hours ago