పెద్ద స్టార్ హీరో కావడానికి ఒక కొత్త థియరీ చెబుతున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు నాగశౌర్య. ఐదు భారీ హిట్లు పడితే ఆ హీరో ఆటోమేటిగ్గా పెద్ద స్టార్ అయిపోతాడని అతనంటున్నాడు. తన కెరీర్లో అలాంటి తొలి భారీ హిట్ ‘ఛలో’ అతను అభిప్రాయపడ్డాడు. ఇక రెండో హిట్ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘వరుడు కావలెను’ అని అతను ధీమా వ్యక్తం చేశాడు. దీని తర్వాత తాను మూడు భారీ విజయాలు బాకీ ఉంటానని.. అవి కూడా అందుకుంటే తాను పెద్ద స్టార్ అయినట్లే అతను వ్యాఖ్యానించడం విశేషం.
‘ఛలో’ తర్వాత తనకు ఆశించిన విజయాలు దక్కని మాట వాస్తవమే అని నాగశౌర్య చెప్పాడు. ‘నర్తన శాల’ నిరాశ పరిచిందని.. కానీ అలాంటి ఫ్లాప్ మూవీ తర్వాత వచ్చినా కూడా ‘అశ్వథ్థామ’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని.. ఆ సినిమా ఫ్లాప్ అంటే తాను ఒప్పుకోనని నాగశౌర్య అన్నాడు.
‘వరుడు కావలెను’ కథ విన్నపుడు బాగా అనిపించిందని.. షూటింగ్ చేస్తున్నపుడు ఈ చిత్రంపై నమ్మం పెరిగిందని.. ఇక ఎడిటింగ్ టైంలో సినిమా చూసినపుడు బ్లాక్‌బస్టర్ కొడుతున్నామనే ధీమా కలిగిందని నాగశౌర్య చెప్పాడు. సినిమాలో ఏమైనా తేడాలుంటే.. లోటుపాట్లుంటే కచ్చితంగా ఎడిటింగ్ టైంలో తెలిసిపోతుందని.. కానీ ‘వరుడు కావలెను’ విషయంలో అలాంటి ఫీలింగ్ కలగలేదని.. ఈ సినిమాలో 15 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ హైలైట్ అని.. తన కెరీర్లోనే ఇది బెస్ట్ క్లైమాక్స్ అవుతుందని నాగశౌర్య ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సినిమాను తన కుటుంబ సభ్యులకు చూపించమని నిర్మాతలు అన్నారని.. కానీ సినిమా అటు ఇటుగా ఉన్నపుడు వాళ్లకు చూపించి అభిప్రాయం తెలుసుకోవాలని.. కానీ సినిమా బాగా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్ ఉన్నపుడు రిలీజ్ రోజు ప్రేక్షకులతో కలిసి చూడటమే కరెక్ట్ అనిపించి వాళ్లకు సినిమా చూపించలేదని శౌర్య అన్నాడు. మొత్తానికి నాగశౌర్య మాటల్ని బట్టి చూస్తుంటే ‘వరుడు కావలెను’ విషయంలో అతను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అర్థమవుతోంది.
This post was last modified on October 29, 2021 7:32 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…