నందమూరి బాలకృష్ణ నెవర్ బిఫోర్ రోల్‌లోకి మారాడు ఈ మధ్యే. ఆయన తొలిసారి టీవీ హోస్ట్ అవతారం ఎత్తాడు. ‘ఆహా’ ఓటీటీ కోసం నందమూరి హీరో ‘అన్ స్టాపబుల్’ అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో షూట్ మొదలైంది. చకచకా ఎపిసోడ్లు లాగించేస్తున్నారు. ఐతే ఈ షో కర్టెన్ రైజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కానీ.. ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అన్నది మాత్రం ‘ఆహా’ టీం ఇప్పటిదాకా వెల్లడించలేదు. అభిమానుల్లో ఈ విషయం ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.
ఐతే ఎట్టకేలకు ‘అన్‌స్టాపబుల్’ ప్రిమియర్స్ విషయంలో ఆహా వారు అప్‌డేట్ ఇచ్చారు. ఇందుకోసం దీపావళి పండుగకు ముహూర్తం ఖరారు చేశారు. నవంబరు 4న దీపావళి రోజే ‘అన్‌స్టాపబుల్’ ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ కూడా జోడించారు.
“బాలయ్య బాబు షోలో సందడి చేయాలా.. దెబ్బకి మనందరి థింకింగ్ మారిపోవాలా” అనే క్యాప్షన్‌తో ‘అన్ స్టాపబుల్’ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి ప్రిమియర్స్ అప్‌డేట్ ఇచ్చారు ఆహా వారు. ఈ పోస్టర్లో బాలయ్య రాయల్‌గా కూర్చున్న పోజు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ షో కోసం బాలయ్య అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లోకి మారారు. షో కర్టెన్ రైజర్లో బాలయ్య ఎంత హుషారుగా కనిపించారో తెలిసిందే. షోలో హోస్ట్‌గానూ అదే హుషారు చూపిస్తారని అభిమానులు ఆశతో ఉన్నారు.
‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ 12 ఎపిసోడ్లతో ఉంటుందని.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షల చొప్పున మొత్తంగా రూ.4.8 కోట్ల రూపాయలు పారితోషకం కింద బాలయ్య పుచ్చుకుంటున్నారని.. ఆ మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగించబోతున్నారని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 25, 2021 8:21 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…