యూట్యూబ్ ఛానెళ్లలో సినిమా వాళ్ల మీద పెట్టే వీడియోలు.. ఆ వీడియోలకు పెట్టే థంబ్ నైల్స్ చూస్తే దిమ్మదిరగడం ఖాయం. లోపల మేటర్ ఏమీ లేకున్నా.. ఏదో ఉంది అనిపించేలా సెన్సేషనలైజ్ చేసే హెడ్డింగ్స్, థంబ్ నైల్స్ పెట్టి జనాల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో థంబ్ నైల్స్ మరీ ఘోరంగా ఉంటాయి.
ఈ యూట్యూబ్ ఛానెళ్లు వందల సంఖ్యలో ఉంటాయి.. వాటిని ఎవరు ఎక్కడి నుంచి నడుపుతున్నారో తెలియదు. అందుకే సినీ జనాలు వాటిని పట్టించుకోరు. కానీ ఈ మధ్య ఈ ఛానెళ్లు మరీ శ్రుతి మించి పోతుండటం.. హీరో హీరోయిన్ల ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసేలా వీడియోలు, థంబ్ నైల్స్ పెడుతుండటంతో ఇండస్ట్రీ జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా సమంత తన విడాకుల విషయంలో లేని పోని ప్రచారాలు చేసిన.. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల మీద కేసులు వేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైతం.. యూట్యూబ్ ఛానెళ్లకు గట్టి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. యూట్యూబ్ ఛానెళ్లలో హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు, థంబ్‌నైల్స్ పెడితే క్షమించేది లేదని మంచు విష్ణు హెచ్చరించాడు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు నటీనటుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని.. వాటిపై చర్యలు తీసుకుంటామని విష్ణు అన్నాడు. హీరోయిన్లంటే మన ఆడపడుచులని.. వాళ్లను గౌరవించాలని.. కానీ యూట్యూబ్ ఛానెళ్లలో థంబ్‌నైల్స్ మరీ హద్దులు దాటుతున్నాయని విష్ణు అన్నాడు. ఇకపై హీరోయిన్లపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తే ఉపేక్షించమని.. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ‘మా’ తరఫున ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామని విష్ణు వెల్లడించాడు.
హద్దులు మీరే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లును నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని విష్ణు పేర్కొన్నాడు. మరి సినీ జనాలను దారుణంగా టార్గెట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను నియంత్రించే విషయంలో మాటలకు పరిమితం కాకుండా మంచు విష్ణు నిజంగానే ఓ కార్యాచరణతో వస్తాడేమో చూద్దాం.
This post was last modified on October 25, 2021 6:04 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…