మోస్ట్ ఎలిజిబుల్… కి నాగ్ రిపేర్లు!

అఖిల్ అక్కినేనికి హిట్టు రాలేదనేది నాగార్జునని బాగా వేధిస్తోన్న వెలితి. నాగ చైతన్య కెరీర్ సాఫీగా సాగిపోతోంది కానీ అఖిల్ మాత్రం ఇంకా సక్సెస్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో అఖిల్ కి హిట్టిచ్చే బాధ్యత అల్లు అరవింద్ కి అప్పగించారు నాగార్జున. బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తయింది. ఇంతకాలం ఈ చిత్రం విషయంలో నాగ్ కలుగజేసుకోలేదు.

లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోవడంతో ఇంతవరకు చేసిన ఎడిటెడ్ వెర్షన్ నాగార్జున చూశారట. ఆయనకి అంతా నచ్చింది కానీ చిన్న చిన్న సమస్యలు అనిపించి దర్శకుడికి కొన్ని సలహాలు ఇచ్చారట. ఆ చిన్న చిన్న మార్పులు చేస్తే సెట్ అయిపోతుందని నాగ్ చెప్పడంతో అందుకు భాస్కర్ కూడా సరే అన్నాడట. షూటింగ్ త్వరలో మొదలైతే కనుక దసరా టైంకి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకుంటున్నారు.