మామూలుగా ఫిబ్రవరి ఆరంభం నుంచి.. మార్చి మధ్య వరకు పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడతారు. అది పరీక్షల కాలం. కాబట్టి యూత్ సినిమాలకు రావడం తగ్గిపోతుంది. వాళ్లతో పాటే ఫ్యామిలీస్ కూడా సినిమాలకు దూరంగా ఉంటాయి. అందుకే ఆ టైంలో చాలా వరకు చిన్న సినిమాలనే లాగించేస్తుంటారు.
పెద్ద సినిమాలు మార్చి నెలాఖర్లో వేసవి సీజన్ ఆరంభం ఆరంభంలో బరిలోకి దిగడం మొదలవుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా వచ్చే ఫిబ్రవరిలో ఆచార్య లాంటి భారీ చిత్రం షెడ్యూల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ చిత్రం 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమా ఫిబ్రవరిలో రావడం ఏంటని మెగా అభిమానులు షాకయ్యారు రిలీజ్ డేట్ ప్రకటించినపుడు.
ఇప్పుడు మరో పెద్ద సినిమా ఫిబ్రవరి రిలీజ్‌కు రెడీ అయింది. అదే.. ఎఫ్-3. 2019 సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్నందుకున్న ఎఫ్-2కు సీక్వెల్‌గా రానున్న సినిమా ఇది. ఈ ఏడాది ఆగస్టులోనే రావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యమై.. వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా అంత అనుకూలమైందేమీ కాదు. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా సాధించిన విజయాన్ని చూసి ఆచార్య, ఎఫ్-3 సినిమాలు ధైర్యం చేసినట్లున్నాయి.
ఉప్పెన చిన్న స్థాయి సినిమానే అయినా.. ఫిబ్రవరిలో విడుదలై ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. ఆ నెలలో పెద్దగా వసూళ్లు రావు అనే అభిప్రాయాన్ని మార్చింది. కానీ ఆ సినిమా రిలీజైనపుడు పరిస్థితులు వేరు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత పెద్దగా సినిమాలు లేక జనాలు కరవులో ఉన్న టైంలో మంచి లవ్ స్టోరీ పడటం, అప్పుడు స్కూళ్లు కాలేజీలు లేక యూత్ కూడా బాగా థియేటర్లకు రావడంతో దానికి అనూహ్యమైన. వసూళ్లు వచ్చాయి. మరి రాబోయే ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయనుకుంటే పొరబాటే. జనవరిలో భారీ చిత్రాల మోత తర్వాత ఫిబ్రవరి సినిమాలకు ఏమంత ఊపు ఉంటుందన్నది డౌటు. వచ్చే ఫిబ్రవరిలో స్కూళ్లు, కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో నడిచే అవకాశం ఉండటంతో వసూళ్లపై ప్రభావం పడొచ్చు.
This post was last modified on October 24, 2021 9:48 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…