అంతా అనుకున్నట్లు జరిగితే ఈపాటి దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకంపనలు రేపుతుండాలి. దేశం మొత్తం ఈ సినిమా గురించే చర్చించుకుంటూ ఉండాలి. ఇండియా అంతటా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని అక్టోబరు 13వ తేదీ నుంచి సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
అంతకుముందే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ముచ్చటగా మూడోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. కొత్త రిలీజ్ డేట్ విషయంలో పరిపరి విధాల ఆలోచించి.. అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి చివరికి 2022 జనవరి 7కు సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉండటంతో ఆర్ఆర్ఆర్ కొత్త డేట్ విషయంలో ఆ చిత్రాల బృందాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ తమకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే డేట్‌కు ఆర్ఆర్ఆర్ టీంకు కట్టుబడి ఉంది. కాకపోతే ఇంకా ప్రమోషన్లు మాత్రం మొదలుపెట్టలేదు. కాగా విడుదలకు సరిగ్గా రెండు నెలల ముందు ప్రమోషన్ల హోరు మొదలుపెట్టనుందట చిత్ర బృందం. ఇందుకోసం దీపావళి పండుగకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు సమాచారం.
గత ఏడాది సీతారామరాజు, కొమరం భీంల మీద వేర్వేరుగా టీజర్లు వదిలాడు రాజమౌళి. ఇప్పుడు ఇద్దరినీ కలిపి ఒక స్పెషల్ టీజర్‌ను రెడీ చేస్తున్నాడట. మెరుపులు మెరిపించేలా.. సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా ఈ టీజర్ ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. త్వరలోనే టీజర్ గురించి అనౌన్స్‌మెంట్ రానుందట.
ఈ టీజర్ తర్వాత దేశవ్యాప్తంగా భారీగానే ప్రమోషన్లు చేయడానికి ప్రణాళిక సిద్ధమైందట. సోషల్ మీడియా ప్రచారంతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, కోచి లాంటి నగరాల్లో ఈవెంట్లతో సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 24, 2021 12:36 am
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…