Prabhas
ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ యాక్సెప్ట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటున్నాయి. ‘రాధేశ్యామ్’లో లవర్‌గా, ‘ఆదిపురుష్’లో రాముడిగా, ‘సాలార్’లో సైనికుడిగా మెప్పించడానికి రెడీ అయిన డార్లింగ్.. ‘ప్రాజెక్ట్ కె’లో ఎలా కనిపిస్తాడా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. రీసెంట్‌గా టీమ్ పెట్టిన పోస్ట్ దానికి జవాబు చెప్పినట్టుగా ఉంది.
ఇవాళ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ‘రాధేశ్యామ్’ టీమ్ టీజర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇస్తే.. ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఓ హింట్ ఇచ్చింది. ‘సినిమా రంగంలో ఓ కొత్త ఒరవడిని తెచ్చిన సూపర్ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని చెప్పింది. దాంతో ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని, ఆ విషయాన్నే ఈ విధంగా కన్‌ఫర్మ్ చేశారని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్‌లో దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. నవంబర్‌లో షూట్ రీస్టార్ట్ చేసి కంటిన్యుయస్‌గా చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాకి ప్రభాస్ రెండొందల రోజులు కేటాయించాడంటే అతని రోల్ ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు.
అత్యధిక బడ్జెట్‌తో, సరికొత్త టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు ఆల్రెడీ అశ్విన్ కూడా చెప్పాడు. దాన్ని బట్టి ఇది కచ్చితంగా సూపర్ హీరో ఫిల్మే అయ్యుండొచ్చని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. ఇప్పుడిక అదే నిజమని ఫిక్సైపోయారు.
This post was last modified on October 23, 2021 2:02 pm
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…