‘పెళ్లిసంద-డి’ సినిమా ప్రోమోలు చూసి ఈ కాలంలో ఇలాంటి సినిమా ఏంటి అన్నారు చాలామంది. ట్రైలర్ చూసి ఇది కొన్ని దశాబ్దాల ముందు రావాల్సిన సినిమా అని కలిగిన అభిప్రాయాలకు తగ్గట్లే ఈ చిత్రం రూపొందింది. ఎంత తక్కువ అంచనాలతో వెళ్లినా కూడా నిరాశకు గురి చేసే స్థాయిలో చాలా పేలవమైన కథాకథనాలతో పాత చింతకాయ పచ్చడి సినిమాలా కనిపించింది ‘పెళ్ళిసంద-డి’. ఈ చిత్రానికి చాలా బ్యాడ్ రివ్యూలొచ్చాయి. టాక్ కూడా ఏమీ బాగా లేదు. అయినా సరే.. సినిమా దసరా సెలవుల్ని ఉపయోగించుకుని దాని స్థాయిలో అది మంచి వసూళ్లే రాబట్టింది.
ఇండస్ట్రీలోనే కాదు జనాల్లోనూ మంచి పేరున్న శ్రీకాంత్ కొడుకు రోషన్ పూర్తి స్థాయి హీరోగా నటించిన తొలి చిత్రం కావడం, అతడితో పాటు హీరోయిన్ శ్రీలీల చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం.. పాటలు బాగుండటం ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి.
మొత్తానికి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిట్ స్టేటస్ అందుకున్న అరుదైన చిత్రాల్లో ‘పెళ్ళిసంద-డి’ ఒకటైంది. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచిన హీరో హీరోయిన్లకు మంచి అవకాశాలే వస్తాయని భావిస్తున్నారు. కాకపోతే రోషన్ విషయంలో శ్రీకాంత్ కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పటికే టీనేజీలో ‘నిర్మలా కాన్వెంట్’ అనే ఒక ఔట్ డేటెడ్ సినిమా చేశాడు రోషన్. ‘పెళ్ళి సంద-డి’ అంతకుమించిన ఔట్ డేటెడ్ సినిమా. ఇంకోసారి ఇలాంటి రొటీన్ సినిమా చేస్తే రోషన్ పట్ల జనాల అభిప్రాయం మారిపోతుంది. అతడికి తిరస్కారం తప్పదు. కాబట్టి రోషన్‌కు ఎలాంటి అవకాశాలు వస్తాయి.. వాటిలోంచి ఏవి ఎంచుకుంటారన్నది కీలకం. కాబట్టి శ్రీకాంత్ కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశముంది.
ఐతే ఈలోపు ‘పెళ్ళిసంద-డి’ హీరోయిన్ మాత్రం బిజీ అయిపోయేలాగే కనిపిస్తోంది. ఈ సినిమాలో నటిస్తుండగానే ఆమెకు రవితేజ సరసన అవకాశం లభించింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఇటీవలే మొదలైన ఈ చిత్రంలో శ్రీలీల ఒక హీరోయిన్‌గా ఖరారైంది. అదే సమయంలో ‘పెళ్ళిసంద-డి’తో శ్రీలీలకు మంచి పేరు, క్రేజ్ రావడంతో ఆటోమేటిగ్గా అవకాశాలు వరుస కడతాయనడంలో సందేహం లేదు. స్టార్ హీరోయిన్ కావడానికి కావాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న శ్రీలీల టాలీవుడ్లో బాగానే బిజీ అయ్యేలా ఉంది.
This post was last modified on October 22, 2021 10:11 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…