చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ.. భిన్నమైన నేపథ్యంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే వారు చాలా అరుదు. టాలీవుడ్ లో మహిళా నిర్మాతలే తక్కువ. అలాంటిది నిర్మాతగా వ్యవహరిస్తూ.. తానే హీరోయిన్ గా చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది. ఆమె నాట్యం మూవీ హీరోయిన్ కమ్ నిర్మాత సంధ్య రాజు. ఈ వారాంతంలో విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ముచ్చట్లు కంటే.. ఆమెకు సంబంధించిన వివరాలు కాస్త భిన్నంగా.. మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
చిన్నతనం నుంచి నాట్యం అంటే తనకు ప్రాణమని.. నిత్యం నాట్యం మీదనే తన ఆలోచనలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే పలు కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారట. ఇతరభాషల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.. అయినా సరే కమర్షియల్ మూవీస్ లో నటించే అవకాశం వచ్చినా.. తాను చేయను అని స్పష్టం చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఉన్నాం.. ఫలానా హీరోతో సినిమా చేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందన్న ట్యాగులు తనకు అక్కర్లేదని.. కంటెంట్ బాగున్న సినిమాను చేస్తున్నట్లు చెప్పారు.
నిర్మాతగా వ్యవహరిస్తూ నటిగా వ్యవహరించడం చాలా పెద్ద టాస్క్ అనిపించినట్లు చెప్పారు. సినిమాను పూర్తి చేసి థియేటర్ కు పట్టుకురావటం చాలా కష్టంగా అనిపించినట్లు చెప్పారు. గతంలో నాట్యం మీద షార్ట్ ఫిలిం చేశామని.. దానికి ఆదరణ బాగా వచ్చినట్లు చెప్పారు. మంచి కథ.. పాత్ర వస్తేనే సినిమా చేస్తాను తప్పించి.. ఏది పడితే అది చేయనని చెప్పారు. నాట్యం మీద తనకున్న ఆసక్తిని గుర్తించిన అత్తింటి వారు సైతం తనను నిరుత్సాహానికి గురి చేయకుండా ప్రోత్సహించినట్లు చెప్పారు. మొత్తానికి హీరోయిన్లలో సంధ్యా రాజు కాస్త కాదు.. చాలానే డిఫరెంట్ అని చెప్పొచ్చు.
This post was last modified on October 22, 2021 9:58 am
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…