ఓవైపు వరుస ప్యాన్ ఇండియా సినిమాలకు కమిటవుతూ తన రేంజ్ ఏమిటో గుర్తు చేస్తుంటాడు ప్రభాస్. మరోవైపు మంచితనంతో మనసులు దోచేస్తూ వ్యక్తిగా తాను ఎలాంటివాడో ప్రూవ్ చేస్తుంటాడు. ఇన్నాళ్లూ సౌతిండియన్స్ దగ్గర కాంప్లిమెంట్స్ కొట్టేసిన తను.. ఇప్పుడు నార్త్ వారి ప్రశంసల్లో మునిగి తేలుతున్నాడు.
ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ మూవీ చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు ఈ మూవీ షూట్‌లోనూ పాల్గొంటున్నాడు. తనని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆల్రెడీ ప్రభాస్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. హీరోయిన్ కృతీ సనన్ కూడా ఇటీవల తన పార్ట్ కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడింది. తనలాంటి మంచి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, ఎంతో సింపుల్‌గా ఉంటాడని, మొదట సిగ్గుపడినా ఓసారి చనువు ఏర్పడ్డాక చాలా కేరింగ్‌గా, ఎఫెక్షనేట్‌గా మారిపోతాడని తెగ పొగిడేసింది. ఇప్పుడు కో ఆర్టిస్ట్ సన్నీ సింగ్ కూడా వారేవా ప్రభాస్ అంటున్నాడు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా నటిస్తున్నాడు సన్నీ. ఆన్ స్క్రీన్‌లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ ప్రభాస్ తనకు అన్నయ్యే అంటున్నాడు. ‘అంత కూల్‌గా ఎలా ఉంటాడో అర్థం కాదు నాకు. ఎప్పుడూ తన దగ్గర రెండు మూడు రకాల ఫుడ్స్ ఉంటాయి. వాటిని అందరికీ పెడతాడు. ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. తనో పెద్ద స్టార్. ఆ విషయం తనకి తెలీదనుకుంటా’ అంటూ ప్రభాస్ ఎంత ఒదిగి ఉంటాడో , ఎలా ప్రేమను పంచుతాడో చెప్పాడు సన్నీ.
ప్రభాస్‌ని అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా అర్థమవుతూ ఉంటుంది. టాలీవుడ్‌లో అందరికీ ప్రియమైన వ్యక్తి తను. ఇప్పుడు బాలీవుడ్ వారికీ ఫేవరేట్ అయిపోతున్నాడు. దటీజ్ ప్రభాస్ అనిపించుకుంటున్నాడు. అందుకే మరో రెండు రోజుల్లో రానున్న ప్రభాస్ పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు ఇక్కడా, అక్కడా కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on October 22, 2021 9:23 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…