నటీనటులకి సినిమాలే కాదు.. యాడ్స్ కూడా క్రేజ్‌ని, ఇన్‌కమ్‌ని తెచ్చి పెడతాయి. తమకిష్టమైన స్టార్ చెప్పాడని ఆ బ్రాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే పెద్ద కంపెనీలన్నీ ఫిల్మ్ యాక్టర్స్‌కి లక్షలు చెల్లించి తమ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయించుకుంటాయి. అయితే ఒక్కోసారి ఇది ఆయా యాక్టర్ల ఇమేజ్‌ని దెబ్బ తీయడమూ జరుగుతుంది. ఇప్పుడు రెజీనా విషయంలోనూ అదే జరుగుతోంది.
రీసెంట్‌గా ఇన్‌స్టాలో ఒక ఫొటోని పోస్ట్ చేసింది రెజీనా. అందులో ఆమె చేతిలో మందు గ్లాస్ ఉంది. సిగ్నేచర్ విస్కీ యాడ్ ఇది. ‘తొమ్మిదేళ్లప్పుడు యాంకరింగ్ మొదలెట్టాను. ఇప్పుడు సినిమాలు, యాడ్స్ చేసే స్థాయికి వచ్చాను. నా ప్రయాణం, ఈ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ క్షణాల్ని నేను సిగ్నేచర్‌తో సెలెబ్రేట్ చేసుకుంటాను’ అని రెజీనా చెప్పింది. అంతే.. ఆ క్షణం నుంచి ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తావా అని ఒకరు ప్రశ్నిస్తే.. మీరిలా ఆల్కహాల్‌ని ప్రమోట్ చేయడం చూస్తుంటే సిగ్గేస్తోంది, మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తున్నా అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.
సినిమావాళ్ల మీద జనాలకి ఒక అడ్మిరేషన్ ఉంటుంది. తమ ఫేవరేట్ స్టార్స్ తప్పుల్ని ప్రోత్సహిస్తే వాళ్లు తట్టుకోలేరు. పాన్ మసాలా యాడ్ చేసినందుకు మహేష్‌బాబు లాంటి వాడినే వదిలి పెట్టలేదు జనం. టాలీవుడ్ స్టార్స్‌లో మహేష్ చేతిలో ఉన్నన్ని ఎండార్స్‌మెంట్స్ ఎవరి చేతిలోనూ లేవు. అయితే వేటితోనూ రాని సమస్య పాన్ మసాలా యాడ్‌తో వచ్చింది. అంత పెద్ద స్టార్ ఓ పుగాకు ఉత్పత్తిని ప్రమోట్ చేయడమేంటి, ఇది కరెక్ట్ కాదు కదా అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు.
రీసెంట్‌గా అమితాబ్ కూడా ఓ టొబాకో బ్రాండ్ యాడ్‌లో నటిస్తే అలా చేయొద్దంటూ ఫ్యాన్స్ కోరారు. చివరికి నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ కూడా కోరడంతో ఆయన ఎండార్స్‌మెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఇంకెప్పుడూ ఇలాంటి యాడ్స్‌లో నటించనని చెప్పేశారు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ కూడా యాడ్స్‌కి దూరంగా ఉండటానికి కారణం తప్పుడు ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయకూడదనే. కాబట్టి సిగరెట్స్, ఆల్కహాల్, గుట్కా లాంటి హానికారక పదార్థాలను సెలెబ్రిటీస్ ప్రమోట్ చేయకపోవడమే మంచిది
This post was last modified on October 21, 2021 3:34 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…