Movie News

బ్యాచిలర్.. అరుదైన ఘనత

ఒకప్పుడు తెలుగు సినిమాలకు యుఎస్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లనేవి కేక్ వాక్ లాగే ఉండేది. కొంచెం క్లాస్ టచ్ ఉండి, మంచి టాక్ వస్తే.. చిన్న సినిమాలు సైతం ఈజీగా మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోయేవి. అక్కడ తెలుగు సినిమాల దూకుడు చూసి వేరే భాషా చిత్రాల బయ్యర్లు ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి. అర్జున్ రెడ్డి, ఫిదా, అఆ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం విశేషం. ఐతే కరోనా రాకముందు వరకు తెలుగు సినిమాలకు యుఎస్‌లో ఎదురే లేదు.

కానీ వైరస్ పుణ్యమా అని మిగతా చిత్రాల్లాగే తెలుగు సినిమాలూ అక్కడ గట్టి ఎదురు దెబ్బ తిన్నాయి. యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. మళ్లీ పుంజుకోవడానికి టైం పట్టింది. ఐతే ఇక్కడ కూడా మిగతా భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాలు దూకుడు చూపించాయి.

కరోనా బ్రేక్ తర్వాత జాతిరత్నాలు హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ కూడా ఆ మార్కును దాటింది. మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువగా వెళ్లింది. ఈ మధ్యే ‘లవ్ స్టోరి’ కరోనా విరామం తర్వాత అన్ని తెలుగు చిత్రాల రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ఆ సినిమా అలవోకగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.

ఇప్పుడు మరో అక్కినేని కుర్రాడు కూడా యుఎస్‌ బాక్సాఫీస్‌లో జోరు చూపిస్తున్నాడు. దసరా కానుకగా విడుదలైన అఖిల్ కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కరోనా బ్రేక్ తర్వాత హాఫ్ మిలియన్ మార్కును దాటిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా బుధవారం అర మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టింది. వీకెండ్ అయ్యేసరికే 4.5 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత కొంచెం నెమ్మదిగానే అడుగులు వేసింది. మొత్తానికి హాఫ్ మిలియన్ క్లబ్బులోకి చేరింది.

This post was last modified on October 21, 2021 10:51 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

10 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago