టాలీవుడ్లో నెమ్మదిగా కొత్త సినిమాల సందడి పెరుగుతోంది. గత నెలలో ‘లవ్ స్టోరి’ మూవీకి.. ఈ నెలలో దసరా చిత్రాలు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్ళిసందడి’లకు అంచనాలకు మించి వసూళ్లు రావడం ఇండస్ట్రీలో కొత్త జోష్ నింపింది. దీంతో మరింత ఉత్సాహంగా కొత్త చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ రోజు ‘రాజా విక్రమార్క’ సినిమాకు విడుదల తేదీ ప్రకటించారు. ఆ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో కార్తికేయ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. ఈ చిత్రం విజయవంతం కావడం అతడికి చాలా చాలా అవసరం. ‘ఆర్ఎక్స్ 100’తో మంచి పాపులారిటీ సంపాదించిన కార్తికేయ.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఓకే చేసేశాడు. ఎడాపెడా సినిమాలు చేసేశాడు. కట్ చేస్తే మూడేళ్లు తిరిగేసరికి అరడజను ఫ్లాపులు అతడి ఖాతాలో చేరాయి.
చివరగా కార్తికేయ నుంచి వచ్చిన ‘చావు కబురు చల్లగా’ కూడా డిజాస్టర్ కావడం తెలిసిందే. దీంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడతను. ఐతే కార్తికేయ గత చిత్రాలతో పోలిస్తే ‘రాజా విక్రమార్క’ ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో విక్రమ్ అనే స్పెషల్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజైన ‘రాజా విక్రమార్క’ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. థ్రిల్లింగ్‌గా ఉంటూనే వినోదానికి ఢోకా లేని చిత్రంలాగా కనిపించింది టీజర్ చూస్తే. రామారెడ్డి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించాడు. కార్తికేయ సరసన తమిళ అమ్మాయి తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటించింది.
నవంబరు 12న మరో యువ కథానాయకుడు నాగశౌర్య చిత్రం ‘లక్ష్య’ కూడా విడుదల కానుంది. అతడికి కూడా ఆ సినిమా సక్సెస్ కావడం ఎంతో కీలకం. రెండూ యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాలే, యంగ్ హీరోలు నటించినవే. మరి వీటిలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 11:33 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…