పర్సనల్ లైఫ్‌లో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలిచింది సమంత. తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెడుతూ ఆమధ్య ఓ నోట్ కూడా విడుదల చేసింది. దాంతో ఆమె విడాకులపై వస్తున్న వార్తలు చాలావరకు ఆగాయి. అయితే ఇప్పుడు తన వర్క్ విషయంలో చర్చలు మొదలయ్యాయి.
తెలుగులో శాకుంతలమ్, తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రాల్ని పూర్తి చేసిన సామ్.. దసరా సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. ఈ బైలింగ్వల్ మూవీ నవంబర్‌లో సెట్స్‌కి వెళ్లబోతోంది. మరోవైపు ఆహా కోసం ఆమె ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలిసింది. సామ్ జామ్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో ఆహా సంస్థ సమంతతో ఈ సిరీస్ ప్లాన్ చేసిందట. అయితే ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి సమంత చాలా కండిషన్స్ పెట్టింది అంటూ కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.
బౌండెడ్ స్క్రిప్ట్‌తో వస్తేనే తప్ప ఏ ప్రాజెక్ట్‌కీ ఓకే చెప్పనని సమంత కండిషన్ పెట్టిందట. మరే ప్లేస్‌లో షూటింగ్ ప్లాన్ చేసినా పర్లేదు కానీ హైదరాబాద్‌లో మాత్రం వీలు కాదని చెప్పిందట. ఒకవేళ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ అవసరమై షూట్ చేయాలనుకుంటే, ఇన్‌డోర్‌లోనే తప్ప ఔట్‌డోర్‌లో చేయడానికి ఒప్పుకోనందట. పబ్లిక్‌ని ఫేస్ చేయలేక, వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఆమె ఇలాంటి కండిషన్స్ పెడుతోంది అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ప్రమోషన్స్‌కి, ఈవెంట్స్‌కి కూడా ఇక దూరంగా ఉంటుందేమో అనే కొత్త సందేహాలు రేపుతున్నారు.
ఈ కామెంట్స్ పై సమంత సన్నిహితులు మండిపడుతున్నారు. సమంత అంత పిరికిది కాదని, దేనినైనా ఫేస్ చేయగలిగే స్ట్రాంగ్ పర్సన్ అని అంటున్నారు. అయినా ఇది సమంత ఒక్కదాని విషయంలోనే జరగలేదు కదా, చాలామంది విషయంలో డివోర్స్ అనేది జరిగింది, మరి తననే ఎందుకిలా వేధిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు. తనని కాస్త ప్రశాంతంగా వదిలి పెట్టొచ్చు కదా అంటున్నారు.
వారి మాటల్లోనూ నిజం లేకపోలేదు. వ్యక్తిగత జీవితంలోని బాధని మర్చిపోవడానికి వర్క్ చేయడమే మంచి సొల్యూషన్. అందుకే కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది సామ్. ఇక బౌండెడ్ స్క్రిప్ట్ అడిగే హక్కు ప్రతి యాక్టర్‌కీ ఉంది. సినిమా మొదట్నుంచి చివరి దాకా ఎలా ఉంటుందో తెలుసుకున్నాకే ఎస్ చెప్తారు ఏ స్టార్ అయినా. దాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదేమైనా తనకు ప్రైవసీ ఇవ్వమని, ప్రశాంతంగా వదిలిపెట్టమని సమంత ఎంత రిక్వెస్ట్ చేసినా జనాల కళ్లు మాత్రం ఆమె నుంచి పక్కకు తప్పుకోవడం లేదు.
This post was last modified on October 19, 2021 11:13 am
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…