సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి దశాబ్దం కిందట్నుంచి చర్చ జరుగుతోంది. ఆమె శింబును పెళ్లి చేసుకుంటుందని ముందు వార్తలొచ్చాయి. తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆపై ప్రభుదేవా ప్రేమలో పడి అతడితో పెళ్లి వరకు వెళ్లింది.
ఇందుకోసం సినిమాలు కూడా వదిలేయడానికి సిద్ధమైంది. కానీ అతడితోనూ బంధం తెగింది. ఆపై సీరియస్‌గా సినిమాల్లో మునిగిపోయిన నయన్.. కొన్నేళ్ల కిందటే తాను హీరోయిన్‌గా నటించిన నానుమ్ రౌడీదా సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ మంచి అండర్ స్టాండింగ్‌తో సాగుతున్నారు. నాలుగేళ్లకు పైగా వీరి ప్రేమాయణం సాగుతోంది. విఘ్నేష్‌తో జీవితాంతం బంధంలో ఉండటానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది నయన్.
వీరి పెళ్లి గురించి రెండేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోతోంది. ఐతే ఎట్టకేలకు నయన్, విఘ్నేష్ పెళ్లికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఇద్దరూ లైమ్ లైట్లో ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు కాదు. పెళ్లిని కూడా ఆడంబరంగా చేసుకోవాలనుకునే తరహా కాదు. పైగా వారికి లాక్ డౌన్ కలిసొస్తోంది. అందుకే ఈ టైంలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారట.
త్వరలోనే ఓ గుడిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. పెళ్లి గురించి అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు లేవని.. సింపుల్‌గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇస్తారని కూడా అంటున్నారు. మరి ఈసారైనా నయన్ పెళ్లి వార్త నిజమవుతుందేమో చూడాలి.
This post was last modified on June 3, 2020 7:47 am
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే……
కోర్ట్ రూపంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ చవి చూసిన ప్రియదర్శి నెల తిరగడం ఆలస్యం ఏప్రిల్ 18న సారంగపాణి జాతకంతో…