ఎవ్వరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షోను నడిపించబోతున్నారు. ఇన్నేళ్లలో టీవీ కార్యక్రమాలకు అతిథిగా వెళ్లాడు తప్ప.. తనే హోస్టుగా మారి ఏ షోనూ నడిపించలేదు ఈ నందమూరి హీరో. అలాంటిది ఆహా ఓటీటీ కోసం బాలయ్య హోస్ట్ బాధ్యతలు చేపట్టడం అందరికీ పెద్ద షాకే.
బాలయ్య ఇలా హోస్ట్ కావడమే ఆశ్చర్యం అంటే.. నందమూరి వారికి శత్రు వర్గంగా భావించే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ నేతృత్వంలో నడిచే ఓటీటీ కోసం ఈ షో చేయడం ఇంకా షాకిచ్చే విషయం. ఈ షో కోసం బాలయ్యను అరవింద్ అడగడమూ చిత్రమే.
ఐతే ఇద్దరూ వేరే విషయాలేవీ ఆలోచించకుండా ఈ షో విషయంలో అంగీకారానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మరి అన్ స్టాపబుల్ పేరుతో రానున్న ఈ షో కోసం బాలయ్య ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.
ఆహా వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షల చొప్పున పారితోషకంగా పుచ్చుకోనున్నాడట. ఈ షో తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. అంటే ఈ లెక్కన మొత్తంగా బాలయ్య రూ.4.8 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్నమాట. ఆయన మార్కెట్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగానే అల్లు వారు పారితోషకం ఇస్తున్నట్లన్నమాట.
బాలయ్య పారితోషకానికే దాదాపు ఐదు కోట్లు అయిపోతే.. షో కోసం మొత్తంగా ఎంత ఖర్చు పెడతారో.. ఇంత బడ్జెట్ పెట్టడం వల్ల ఆహాకు ఒనగూరే ఆర్థిక ప్రయోజనం ఎంతో చూడాలి. ఆహా వైపు సబ్‌స్క్రైబర్లను మరింతగా ఆకర్షించడానికి మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున పేరున్న చిత్రాల స్ట్రీమింగ్ హక్కులు తీసుకోవడమే కాక.. వెబ్ సిరీస్‌లు కూడా బాగానే నిర్మిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో అడుగులేస్తున్న నేపథ్యంలోనే బాలయ్యతో ఈ మెగా షోకు ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on October 17, 2021 10:41 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…