మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ మీద ఆయన ప్రత్యర్థి వర్గం చేసిన ప్రధాన ఆరోపణ.. ఆయన క్రమశిక్షణా రాహిత్యం గురించే. గతంలో పలుమార్లు ఆయనపై కంప్లైంట్లు రావడం.. ‘మా’ నుంచి హెచ్చరికలు అందుకోవడం.. అలాగే రెండుమూడుసార్లు నిషేధం కూడా పడటం గురించి ప్రత్యర్థులు ప్రస్తావిస్తూ.. ఇలాంటి వ్యక్తి ‘మా’ అధ్యక్షుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. దీనిపై ప్రకాష్ రాజ్ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ఐతే ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో ప్రకాష్ రాజ్ ఈ విమర్శలు, ఆరోపణలపై స్పందించారు.
తనపై ఎప్పుడెప్పుడు.. ఎందుకు నిషేధం పడిందో.. అందుకు దారితీసిన పరిస్థితులేంటో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మహేశ్‌బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. షూటింగ్ వాయిదా వేస్తూ వెళ్తుండటం వల్ల సమయానికి డేట్లు కుదరక వేరే నటుడిని తీసుకున్నారని.. కానీ పత్రికల్లో మాత్రం తనను తీసేసి వేరే నటుడిని పెట్టుకున్నారని రాశారని.. అదెలా రాస్తారని గట్టిగా అడగడంతో తనపై తొలిసారి నిషేధం విధించారని ప్రకాష్ రాజ్ వివరించారు.
ఇక శ్రీను వైట్లతో ‘ఆగడు’ సమయంలో జరిగిన గొడవ గురించి కూడా ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌లో శ్రీను వైట్లకు కావాల్సిన వేగం రావట్లేదని.. ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో తెలియదని.. తాను సెట్ నుంచి వెళ్లిపోయానని.. కానీ తర్వాత ‘శీను రేపొకసారి కలిసి మాట్లాడదాం’ అని చెప్పానని.. కానీ తర్వాతి రోజు తన స్థానంలో సోనూసూద్ వచ్చారని.. ఆ తర్వాత తాను బూతులు తిట్టానంటూ నిషేధం విధించారని ప్రకాష్ రాజ్ చెప్పారు. మీకింత యాటిట్యూడ్ లేకపోయి ఉంటే ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకునేదేమో అని ఆలీ అంటే.. ఆ యాటిట్యూడ్ వల్లే తాను ఇంత బలమైన వ్యక్తిగా మారేవాడిని కాదేమో అని ప్రకాష్ రాజ్ బదులిచ్చారు. తన యాటిట్యూడ్ వల్ల ఎంత పొందానో, అంత పోగొట్టుకున్న మాట వాస్తవమని ప్రకాష్ రాజ్ అన్నారు.
This post was last modified on October 16, 2021 3:20 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…