సూపర్ స్టార్ రజినీకాంత్ చివరగా కొట్టిన హిట్ ఏదో చెప్పమంటే ఆయన అభిమానులు కూడా తడబడతారు. ‘కబాలి’, ‘2.0’ లాంటి చిత్రాలకు భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. అవి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. బయ్యర్లకూ సంతోషాన్ని మిగల్చలేదు. గత కొన్నేళ్లలో ఆయన చేసిన మిగతా సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరిగ్గా చెప్పాలంటే ‘రోబో’ తర్వత ఆయనకు నిఖార్సయిన హిట్టే దక్కలేదు. సినిమా సినిమాకూ తన రేంజ్ తగ్గించుకుంటూ, మార్కెట్‌ను దెబ్బ తీసుకుంటూ కెరీర్లో ఎన్నడూ లేని తక్కువ రేంజికి పడిపోయాడు.
విజయ్, అజిత్ లాంటి హీరోలు తమిళంలో రజినీని దాటి ముందుకెళ్లిపోయారు. ఇక తెలుగులో అయితే రజినీ మార్కెట్ మామూలుగా పడిపోలేదు. పదేళ్ల కిందటే 30 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఆయన చిత్రాలకు ఇప్పుడు పది కోట్లకు ఇటు ఇటుగా రేటు పలుకుతోంది.
ఇలాంటి సమయంలో రజినీ తమిళంలో ‘అన్నాత్తె’ సినిమా చేశాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ మూవీస్ సునీల్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ‘అన్నాత్తె’ అని పేరు కూడా ఖరారైంది తెలుగులో ఈ చిత్రానికి. నిన్ననే తమిళంలో టీజర్ రిలీజ్ చేశారు. అది చూస్తే రజినీ చాన్నాళ్లకు మంచి హిట్ కొట్టబోతున్నాడేమో.. ఆయన కరువు తీరబోతోందేమో అనిపిస్తోంది. నిజానికి ఈ టీజర్లో కొత్తగా ఏమీ లేదు. హీరో ఎలివేషన్లు, పవర్ ఫుల్ పంచ్ డైలాగులు, భారీతనమే కనిపించింది.
ఐతే దర్శకుడు శివ రొటీన్ కథలనే మాస్ మెచ్చేలా చెప్పడంలో సిద్ధహస్తుడు. ఎమోషన్లు, సెంటిమెంట్, హీరో ఎలివేషన్లు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే తమిళంలో వీరం, వేదాళం, విశ్వాసం.. ఇలాంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఒక్క ‘వివేగం’ మాత్రమే తమిళంలో అతను తీసిన సినిమాల్లో నిరాశ పరిచింది. దాని తర్వాత ‘విశ్వాసం’తో భారీ విజయాన్నందుకున్నాడు. ఈసారి కూడా మసాలాలన్నీ సరిగ్గా కలిపి మాస్‌కు మెచ్చేలా యాక్షన్ ఘట్టాలతో సినిమాను తీర్చిదిద్దినట్లున్నాడు. రజినీ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి టీజర్లో. దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని రజినీకి పెద్ద హిట్ ఇస్తుందనిపిస్తోంది. చూద్దాం ఏమవుతుందో?
This post was last modified on October 15, 2021 5:32 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…