మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇప్పుడు ఇండస్ట్రీలో కాంపిటిషన్ ఉన్నప్పటికీ తమన్నాకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ ఎన్నడూ లేనంత బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. ఇండస్ట్రీలో కొత్తగా వస్తోన్న హీరోయిన్లు కూడా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాస్త పేరున్న వారంతా రెండు కోట్లకు పైగానే అందుకుంటున్నారు. కానీ తమన్నా మాత్రం కోటిన్నర దగ్గరే ఆగిపోయింది.
దీంతో ఆమె తన రెమ్యునరేషన్ పెంచుకునే విషయంలో కొత్త ట్రిక్ ప్లే చేసింది. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే తమన్నాకు సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి తమన్నా ముందుకొస్తుంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే డిమాండ్ చేస్తుంది. అరవై ప్లస్ యాక్టర్లతో కలిసి నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదు. బాలకృష్ణ, చిరు లాంటి స్టార్స్ కు హీరోయిన్ ను వెతకడం పెద్ద టాస్క్ అయిపోయింది.
ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది తమన్నా. సీనియర్ హీరోలతో నటించే సినిమాలకు రెమ్యునరేషన్ పెంచి చెబుతోందట తమన్నా. నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో.. ఆమె అడిగినంత ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్నా.. వెంకీ సరసన ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోంది. అలానే చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో రానున్న ‘భోళా శంకర్’ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలకు తమన్నా భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 15, 2021 5:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…