టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ చాలా బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ లో ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ సమంత క్రేజ్ ను మరింత పెంచింది. ఈ సిరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గానే ఆమె ఓ సినిమా సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంతకు సంబంధించిన ఓ సినిమా అప్డేట్ బయటకొచ్చింది.
నూతన దర్శకుడు శాంతరూబేన్ జ్ఞానశేఖరన్ రూపొందించనున్న ఓ బైలింగ్యువల్ లో సమంత నటించబోతుంది. కార్తీ నటించిన ‘ఖైదీ’, ‘సుల్తాన్’, సూర్య నటించిన ‘ఎన్జీకే’ లాంటి సినిమాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించబోతుంది. కోలీవుడ్ కు చెందిన ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది ఈ సంస్థ.
ఇప్పుడు సమంత హీరోయిన్ గా బైలింగ్యువల్ సినిమాను అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో సమంత వైట్ కలర్ డ్రెస్ వేసుకొని సింపుల్ లుక్ తో కనిపించింది. ఈ మధ్యకాలంలో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన సమంత కెరీర్ పరంగా బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే వరుస సినిమాలను అంగీకరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది.
This post was last modified on October 15, 2021 4:02 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…