వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజని ‘క్రాక్’ సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయాడు మాస్ మహారాజా. ‘ఖిలాడీ’గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ షూట్‌లో పాల్గొంటున్నాడు. త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్షన్‌లో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. దసరా సందర్భంగా ఈ సినిమాకి ‘ధమాకా’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేసినట్లు అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో టెరిఫిక్‌గా ఉన్నాడు రవితేజ. స్టైల్‌గా తయారై.. జేబులో చేతులు పెట్టుకుని.. కళ్లజోడు, నోట్లో సిగార్‌తో సీరియస్‌గా ఉన్నాడు. రెగ్యులర్ లుక్స్‌కి ఇది చాలా భిన్నంగా ఉంది. క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెబుతున్నారు. పోస్టర్ స్ప్లిట్ అయ్యి ఉండటం, మూవీకి ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్ లైన్ ఇవ్వడాన్ని బట్టి డబుల్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
‘క్రాక్’ మామూలు కాప్ స్టోరీయే అయినా డిఫరెంట్ క్యారెక్టరయిజేషన్, సరికొత్త స్క్రీన్‌ప్లే ఉండటంతో కలెక్షన్లు కురిపించింది. ఇక ‘ఖిలాడి’లో డ్యూయెల్ రోల్‌తో అదరగొడతానంటున్నాడు. ‘రామారావ్ ఆన్ డ్యూటీ’లో గవర్నమెంట్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మొత్తంగా సినిమా సినిమాకీ వేరియేషన్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు రవితేజ. ఇక త్రినాథరావ్ టేకింగ్ గురించి తెలిసిందే. సింపుల్ లైన్‌ని సూపర్బ్ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో ఎక్స్‌పర్ట్. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ ‘ధమాకా’ క్రియేట్ చేసే చాన్సెస్ ఫుల్లుగా ఉన్నాయి.
This post was last modified on October 15, 2021 11:13 am
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…