హీరోయిన్లుగా ఓ స్థాయికి చేరుకున్నాకే వేరే క్రాఫ్ట్స్ మీద దృష్టి పెడతారు ఎవరైనా. కానీ నటిగా ఇంకా సెటిల్ కాకముందే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఆశ్చర్యపర్చింది అవికా గోర్. గంధం మురళి నాగశ్రీనివాస్ అనే కొత్త దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తున్నట్టు ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. ఇప్పుడా చిత్రాన్ని కంప్లీట్ చేసినట్టు అనౌన్స్ చేసింది.
‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగునాట ఫేమస్ అయిన అవిక.. ‘ఉయ్యాల జంపాల’ లాంటి మంచి ప్రాజెక్ట్‌తో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి మరికొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాల్లోనూ కనిపించింది. కానీ ఏవో వ్యక్తిగత కారణాల వల్ల కావాలనే కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. తర్వాత స్లిమ్‌గా తయారై, సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా ‘నెట్’ మూవీతో ఓటీటీలో పలకరించింది. త్వరలో నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’ మూవీతో రాబోతోంది.
ఆమె చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక మూవీలో లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోంది అవిక. ఆమెకి జోడీగా సాయి రోనక్ నటిస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీటవడంతో చాలా ఎక్సయిటవుతోంది అవిక. ‘మొదటిసారి ప్రొడ్యూస్ చేస్తూ ఉండటం ఓ గొప్ప అనుభవం. ఇది నాకు నటిగా మరింత సహనాన్ని నేర్పించింది. వ్యక్తిగా ఎలా ఎదగాలో కూడా చెప్పింది. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను’ అంటోంది అవికా. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య అనుబంధం ఏర్పడటం, ఆ తర్వాత వాళ్లు అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకోవడం, దాన్నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. మరి నిర్మాతగా అవిక ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత స్పెషల్‌గా ఉంటుందో చూడాల్సిందే.
This post was last modified on October 14, 2021 6:59 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…