సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ తక్కువేమీ కాదు. ఇక్కడి స్టార్ల సినిమాలకు దీటుగా క్రేజ్ ఉండేది రజినీ సినిమాలకు ఒకప్పుడు. కానీ వరుసగా పేలవమైన సినిమాలు చేసి ఆ క్రేజ్‌ను చేజేతులా దెబ్బ తీసుకున్నాడు రజినీ. తెలుగులో తన సినిమాల ప్రమోషన్, మార్కెటింగ్ మీద సరిగా దృష్టిసారించకపోవడం కూడా ఆయన క్రేజ్ కోల్పోవడానికి కారణం.
రజినీ కొత్త చిత్రం అన్నాత్తె విషయంలోనూ ఇదే అలసత్వం కనిపించింది. దీపావళికి విడుదల పెట్టుకుని ఇప్పటిదాకా తెలుగు టైటిల్ ప్రకటించలేదు. ఏ రకమైన ప్రమోషన్ లేదు. అసలు ఈ చిత్రం నవంబరు 4న తెలుగులో రిలీజవుతుందో లేదో అన్న అనుమానాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలకు తెరదించుతూ తెలుగు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా తెలుగు హక్కుల అమ్మకం పూర్తయింది.
లవ్ స్టోరి సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత వరుసబెట్టి ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పీ సంస్థ అన్నాత్తె చిత్రాన్ని తెలుగులో అందించనుంది. దీని అధినేత సునీల్ నారంగ్ అన్నాత్తె తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. రూ.12 కోట్లకు డీల్ తెగినట్లు చెబుతున్నారు. తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.
ఐతే విడుదలకు 20 రోజులు మాత్రమే సమయం ఉండగా డీల్ జరిగిన నేపథ్యంలో ఇక డబ్బింగ్ పనులు చకచకా అవగొట్టి.. ప్రమోషన్లు జోరుగా చేసి సినిమాను కొంచెం పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సునీల్ చేతిలో పెద్ద ఎత్తున థియేటర్లు ఉన్న నేపథ్యంలో సినిమా మంచి రేంజ్‌లోనే రిలీజవుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ చిత్రానికి తెలుగులో ఏ టైటిల్ ఖరారు చేస్తారన్నది ఆసక్తికరం. తమిళ టైటిల్ అర్థమే వచ్చేలా అన్నయ్య అని చిరంజీవి టైటిల్‌ను వాడేస్తారేమో చూడాలి.
This post was last modified on October 14, 2021 6:55 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…