అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్యానెల్ సభ్యులకు కూడా ఎక్కువ పదవులు దక్కాయి. దీంతో తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మంచు విష్ణు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ ల రాజీనామాలను స్వీకరించడం లేదని.. త్వరలోనే ఇద్దరినీ కలిసి వ్యక్తిగతంగా ఆ విషయాన్ని చెప్పి.. వాళ్ల సపోర్ట్ కావాలని కోరతానని అన్నారు. ప్రకాష్ రాజ్ గారి సలహాలు, పెద్దరికం ‘మా’కు అవసరమని అన్నారు.
ఆ తరువాత రామ్ చరణ్ ఓటు కచ్చితంగా ప్రకాష్ రాజ్ గారికే వేసి ఉంటారని అన్నారు మంచు విష్ణు. ఎందుకంటే రామ్ చరణ్ తన తండ్రి మాటను జవదాటరని.. అది మంచి విషయమే అని.. తను కూడా తన తండ్రి మాటకే కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు చరణ్ ఓటు వేయలేదనే బాధ లేదని అన్నారు.
‘నన్ను ఎలెక్షన్స్ నుంచి తప్పుకోమని చిరంజీవి అంకుల్ మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ గారు పోటీ చేస్తున్నారని.. ఎలెక్షన్స్ ఎందుకు ఆయన్నే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకుందామని చిరంజీవి గారు చెబితే.. కుదరని నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయని మంచు విష్ణు వివరించారు.
ఆ తరువాత ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదనే విషయంపై స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాల వలన రాలేకపోయారని.. కానీ తను గెలిచిన వెంటనే వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ నుంచే అని చెప్పారు మంచు విష్ణు. అతడి సపోర్ట్ ఎప్పుడూ తనకు ఉంటుందని అన్నారు.
This post was last modified on October 11, 2021 8:48 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…