సమంత-నాగచైతన్య తమ వివాహబంధానికి స్వస్తి చెప్పేశారు. ఈ విషయాన్ని ఇద్దరూ అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత వారిపై పుకార్లు ఆగిపోతాయేమో అనుకున్నారు కానీ ఇప్పటికీ పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సమంతకి ఎఫైర్ ఉందంటూ దారుణమైన రూమర్లు వచ్చాయి. సమంత వద్ద స్టైలిస్ట్ గా పని చేస్తోన్న ప్రీతమ్ జూకాల్కర్ తో ఆమెకి తప్పుడు రిలేషన్ ఉందంటూ పుకార్లు వినిపించాయి. వీటన్నింటికీ సమంత ఇటీవల ఘాటుగా బదులిచ్చింది.
అయితే ఇలాంటి తప్పుడు వార్తలను నాగచైతన్య కూడా ఖండిస్తే బాగుండేదని స్టైలిస్ట్ ప్రీతమ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చైతు-సమంత విడాకుల వ్యవహారంలోకి తనను లాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రీతమ్. సమంతను నేను ‘జీజీ’ అని పిలుస్తాననే విషయం అందరికీ తెలుసని ప్రీతమ్ చెప్పారు. జీజీ అంటే నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో సోదరి అని అర్ధం. అలాంటి వ్యక్తితో తనకు ఎఫైర్ ఉందంటూ న్యూస్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
సమంతకు ‘ఐలవ్యూ’ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలామంది అడుగుతున్నారని.. కుటుంబ సభ్యులకు, సోదరిలా భావించే వారికి ‘ఐలవ్యూ’ చెప్పడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు ప్రీతమ్. సమంతకు, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి చైతుకి స్పష్టంగా తెలుసనీ.. ఆయన కూడా ఈ విషయంపై స్పందించకపోవడం చాలా బాధను కలిగిస్తోందని ప్రీతమ్ అన్నారు. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని అన్నారు. చాలా మంది తనను తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారని.. చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారని ప్రీతమ్ వాపోయారు.
This post was last modified on October 11, 2021 1:46 pm
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…