హీరోయిన్‌గా ఉన్నన్నాళ్లూ ఫిజిక్ మీద అత్యంత జాగ్రత్త వహించాల్సిందే. ఏమాత్రం షేపౌట్ అయినట్లు కనిపించినా నెగెటివ్ కామెంట్లు పడిపోతాయి. అందుకే ఎన్నో త్యాగాలు చేస్తూ, కడుపు మాడ్చుకుని, నిత్యం వర్కవుట్లు చేస్తూ జాగ్రత్తగా ఫిజిక్ కాపాడుకుంటూ వస్తారు హీరోయిన్లు. ఇక అవకాశాలు ఆగిపోయి, సినిమాలు తగ్గిపోయి, వ్యక్తిగత జీవితంలో స్థిరపడగానే చాలామంది హీరోయిన్లకు లిమిటేషన్లన్నీ పక్కన పెట్టేసి నచ్చింది తినేస్తుంటారు. వర్కవుట్లు కూడా మానేస్తుంటారు. దీనికి తోడు ఇంకేవైనా ఆరోగ్య పరమైన సమస్యలున్నా కూడా వారి అవతారంలో మార్పు వచ్చేస్తుంటుంది.
ఇలా హీరోయిన్‌గా కెరీర్ ముగించిన కొన్నేళ్లకే గుర్తు పట్టలేని విధంగా తయారైన అమ్మాయిలు చాలామందే కనిపిస్తారు. నిన్నటితరం హీరోయిన్లలో చాలామంది బాగా లావైపోయి జనాలకు షాకిచ్చిన వాళ్లే. కన్నడ భామ రక్షితలో వచ్చిన మార్పు అందరూ చూశారు.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన ఒక హీరోయిన్ షాకింగ్ అవతారంతో చాలా ఏళ్ల తర్వాత జనాల ముందుకు వచ్చి విస్మయానికి గురి చేసింది. ఆమే.. రవళి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ‘పెళ్ళిసందడి’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది రవళి. ఆ సినిమా చలవతో ఆమె పెద్ద పెద్ద స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. ఒక ఐదారేళ్లు కథానాయికగా మంచి ఊపులో సాగిన ఆమె.. ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయింది. తర్వాత ఆమె ఎక్కడుందో ఏమైందో ఎవరికీ తెలియదు.
పెళ్ళి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయిన రవళి.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్ళిసంద-డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుముంది. పాత ‘పెళ్ళిసందడి’లో నటించిన హీరో శ్రీకాంత్, మరో హీరోయిన్ దీప్తి భట్నాగర్ సైతం ఈ వేడుకకు వచ్చారు. ఐతే వీళ్లందరి మధ్య రవళినే షాకింగ్ లుక్‌లో కనిపించింది. బాగా లావైపోయి ఈమేనా రవళి అనిపించింది. తనను జనాలు గుర్తు పట్టడం లేదన్న కారణంతోనే సినిమా వేడుకలకు రావట్లేదని రవళి చెప్పడం విశేషం.
This post was last modified on October 11, 2021 12:30 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…