మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇండస్ట్రీ పెద్ద చిచ్చునే రేపినట్లున్నాయి. మామూలుగా ఎన్నికల ముంగిట వాదోపవాదాలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే ప్రత్యర్థులు.. ఎన్నికల అనంతరం మామూలైపోతారు. కలిసి కూడా పని చేస్తుంటారు. కానీ ఈసారి మాటల దాడి మరీ తీవ్ర స్థాయికి చేరిపోవడం, ఎన్నికల్లో విజయం మరీ ప్రతిష్ఠాత్మకం అయిపోవడం.. ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తడంతో ఎన్నికల అనంతరం అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి.
ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు ప్రకటించిన నాగబాబు.. ఆయన ఓటమి నేపథ్యంలో ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. ‘మా’లో ప్రాంతీయ వాదం, సంకుచితత్వం ఎక్కువైపోయిందని.. ఇలాంటి సంఘంలో తాను ఉండలేనని పేర్కొంటూ రెండు రోజుల్లో ‘మా’కు తన రాజీనామా లేఖ అందుతుందని నాగబాబు ప్రకటించారు.
నిన్న రాత్రి నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ సైతం ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు ప్రకాష్ రాజ్. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారని, తాను తెలుగువాడిని కాదు కాబట్టి తనను ఓడించారని.. అలాంటపుడు తాను ‘మా’ సభ్యుడిగా ఉండటంలో అర్థం లేదని, అందుకే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయనన్నారు. అయితే తెలుగులో నటించడం మాత్రం కొనసాగిస్తానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అండ ఉండటంతో ఒక దశలో ప్రకాష్ రాజే అధ్యక్ష పదవికి ఫేవరెట్‌గా కనిపించారు. కానీ ఎన్నికల ముంగిట పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మంచు విష్ణు వ్యూహాత్మకంగా దూసుకుపోయాడు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, మన వాడిని గెలిపించుకుందాం అనే భావనను అతడి ప్యానెల్ సభ్యుల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతో విష్ణు ఘనవిజయం సాధించాడు. దీన్ని జీర్ణించుకోలేక ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి దూరం కావాాలన్న నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 11, 2021 12:24 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…