దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎలా తెరపైకి వచ్చిందనే విషయంలో ఓ ఆసక్తికర స్టోరీ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ కి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కథలు, కవితలు కూడా రాస్తుంటారాయన. ‘కొండపొలం’ నవల గురించి తెలుసుకున్న ఆయన.. వెంటనే ఆ పుస్తకాన్ని చదివారు.
చదివిన వెంటనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. దీంతో నవల హక్కుల గురించి ఆరా తీశారు. ‘పుష్ప’ సినిమా తరువాత ఓ చిన్న ప్రాజెక్ట్ గా, ప్రయోగాత్మకంగా సినిమా తీయాలని భావించారు. కానీ ‘పుష్ప’ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందో.. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అప్పుడు కూడా తన శిష్యులకి ఎవరికైనా ఈ నవల ఇచ్చి.. సినిమా తీయమంటే ఎలా ఉంటుందా అని ఆలోచించారట.
కానీ ఆ ఆలోచనలను పక్కన పెట్టేశారు. నిజానికి దర్శకుడు క్రిష్ కి ‘కొండపొలం’ నవలను ముందుగా పరిచయం చేసింది సుకుమార్ అని తెలుస్తోంది. అలా క్రిష్ ఈ సినిమా తీయడానికి సుకుమార్ కూడా ఒకరకంగా కారణమయ్యారు. అన్నీ వర్కవుట్ అయ్యి సుకుమార్ గనుక ‘కొండపొలం’ సినిమా తీసి ఉంటే కచ్చితంగా మరోకోణంలో సినిమాను చూసేవాళ్లం. ఎందుకంటే క్రిష్ వర్కింగ్ స్టైల్, సుకుమార్ వర్కింగ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
This post was last modified on October 9, 2021 1:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…