ఒకపుడు వాల్ పోస్టర్లు సినిమాకు కావల్సినంత ప్రచారం తెచ్చిపెట్టేవి. ఆ రోజులు పోయాయి. విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేయటానికి.. ఓపెనింగ్స్ కు సాయం చేయడానికి ఇపుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సాయం చేస్తుంటాయి. అందుకే.. సినిమాను తీర్చిదిద్దటం.. రిలీజ్ కు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారో.. అంతకు మించి అన్నట్లుగా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున రాలేదు. ఆ కొరతను తీర్చేలా నాగచైతన్య వచ్చి.. తమ్ముడికి దన్నుగా నిలిచే అన్నలా వ్యవహరించారు. అంతేకాదు.. తన తమ్ముడు అఖిల్ గురించి గొప్పగా.. అతడికి సినిమాల మీద ఎంత ఆసక్తి ఉందన్న విషయాన్ని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు.
‘అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు.. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్‌లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్‌ని చూస్తుంటాను.. తను ప్రతి సినిమాకి అంత అంకితం అవుతాడు’ అంటూ అతని గురించి వ్యాఖ్యానించాడు.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గురించి మాట్లాడుతూ మనుషుల మధ్య ఉండే అనుబంధాల్ని.. భావోద్వేగాల్ని భాాస్కర్ చాలా బాగా డీల్ చేస్తాడని చెప్పారు చైతన్య. మొత్తానికి సినిమా కంటే కూడా అఖిల్ ఇమేజ్ ను బిల్డ్ చేయటంలో చైతూ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
This post was last modified on October 9, 2021 1:15 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…