Movie News

డ్రగ్స్ వాడటం తప్పు కాదట

షారుఖ్ ఖాన్ కొడుకుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంలో ఎవరెవరో కల్పించుకుని చేసే కామెంట్స్ అంతకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్యన్‌కి సపోర్ట్‌గా కామెంట్స్ పెట్టారు. మరికొందరు తప్పుబట్టారు. ఇప్పుడు మోడల్, నటి సోమీ అలీ కూడా తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ ఆమె మాట్లాడిన విధానం అందరికీ షాకిచ్చింది.

‘పిల్లలు డ్రగ్స్ వాడటం సహజం. నేను కూడా పదిహేడేళ్ల వయసులో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేశాను. ఇందులో పెద్ద విచిత్రమేమీ లేదు. అమెరికా ఎప్పటి నుంచో డ్రగ్స్ గురించి పోరాడుతోంది. కానీ ఇప్పటికీ అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. వాటిని పూర్తిగా తొలగించలేం. అలాగే వ్యభిచారం కూడా. ఈ రెండూ పెద్ద తప్పేం కాదు. ఆర్యన్‌ని వదిలేయండి. చిన్నపిల్లాడిపై ప్రతాపం చూపించే బదులు రేపిస్టులని, క్రిమినల్స్‌ని పట్టుకోండి’ అంది సోమీ.

ఆమె మాటలకి సోషల్ యాక్టివిస్టులు మండి పడుతున్నారు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి డ్రగ్స్ తీసుకోమని, వ్యభిచారం చేయమని ఎంకరేజ్ చేయడమేంటి అని తిడుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ వాళ్లకి కూడా సోమీ మాటలు కోపం తెప్పించాయి. ఎప్పుడో చనిపోయిన దివ్యభారతిని ఎందుకు దీనిలోకి లాగడం, ఎవరి ఒపీనియన్స్ వాళ్లు చెప్పుకోవాలి తప్ప పక్కవారి మీద బురద చల్లకూడదు అంటు కాస్త గట్టిగానే క్లాస్ పీకుతున్నారు.

ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వ్యభిచారం తప్పు కాదన్న ఇదే సోమీ, ఆమధ్య బాలీవుడ్‌ విపరీత పోకడల మీద, వేధింపుల మీద పెద్ద లెక్చర్ ఇచ్చింది. సోమీ ఒకప్పుడు సల్మాన్‌కి గాళ్‌ ఫ్రెండ్. చాలాకాలం లవ్‌లో ఉన్నాక విడిపోయారు. దాని గురించి కూడా మొన్న ఓ సందర్భంలో మాట్లాడింది. సల్మాన్ తనని మోసం చేశాడని, అతనికి ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉందో లెక్కే లేదని, అలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంది. ఇండస్ట్రీలో ఆడపిల్లకి వేధింపులు ఉన్నాయని, తను కూడా వాటిని ఫేస్ చేశానని అంది. ఆరోజు అన్ని మాట్లాడిన మనిషి ఈరోజు ఇలా చీప్ కామెంట్స్ చేయడమేంటి అంటున్నారంతా. నేరాల్ని సమర్థించే ఇలాంటి వాళ్ల మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నవాళ్లూ లేకపోలేదు.

This post was last modified on October 9, 2021 12:49 pm

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

7 minutes ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

35 minutes ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

39 minutes ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

4 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

4 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

5 hours ago