ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశాల్లో ఒకటిగా మారిపోయింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం. గత రెండు పర్యాయాలు కూడా మా ఎన్నికల విషయంలో కొంత రచ్చ జరిగింది కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడూ రసాభాస కాలేదు. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు ఎంత తీవ్ర స్థాయిలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు ఇరు వర్గాలకూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. వారి మద్దతుదారులు కూడా ఎన్నికల్ని అంతే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా జాగ్రత్త పడుతున్నారు కూడా. ఇలాంటి సమయంలో మాలో సభ్యుడైన తమిళ నటుడు సిద్దార్థ్.. ఈ ఎన్నికలపై ఆసక్తికర రీతిలో స్పందించాడు. తాను కూడా మా ఎన్నికల్లో ఓటు వేయబోతున్నట్లు అతను వెల్లడించాడు.
చాలా ఏళ్ల తర్వాత తెలుగులో మహాసముద్రం సినిమాలో నటించిన సిద్ధు.. దసరాకు ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా మా ఎన్నికల గురించి అడిగితే.. ఈ ఎన్నికల వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నా. నేను ఇరు వర్గాలు ఏం చెబుతారో వింటా. చివరగా నాకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తా అని సిద్దార్థ్ చెప్పాడు.
ఇక తెలుగు సినిమాల నుంచి చాన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోవడం గురించి మాట్లాడుతూ.. తనకు నచ్చిన స్క్రిప్టు దొరక్కపోవడం వల్లే విరామం తీసుకున్నానని.. ఇప్పుడు మహాసముద్రం లాంటి షాకింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని.. ఈ సినిమా స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అని.. దీని తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తానని సిద్ధు చెప్పాడు. అజయ్ తనకు ఈ కథ చెప్పగానే తన మేకప్‌మ్యాన్‌కు ఫోన్ చేసి ఇంతకుముందు ఏ సినిమాలో లేని విధంగా తన లుక్ ఉండాలని చెప్పి కొత్తగా తయారయ్యానని.. తన పాత్ర సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అతనన్నాడు.
This post was last modified on October 9, 2021 1:28 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…