ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతడిని ఎన్సీబీకి కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసుని స్పెషల్ కోర్టుకి అప్పగించింది. శుక్రవారం నాడు కొనసాగిన విచారణలో ఆర్యన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ రూల్స్ ప్రకారం.. వచ్చే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైల్లో క్వారెంటైన్ సెల్ లో పెట్టనున్నారు.
ఈ కేసు విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందడానికి అర్హులని.. ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మెజిస్ట్రేట్ కోర్టుకి తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. నిజానికి ఈసారి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ముంబై తీరంలో జరిగిన క్రూజ్ పార్టీలో డ్రస్గ్ తీసుకుంటున్నారని.. గత వారం ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందికి ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే తన దగ్గర డ్రగ్స్ లేకపోయినా.. తన ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఇటీవల కోర్టులో వెల్లడించారు ఆర్యన్ ఖాన్. ఇన్ని రోజులుగా తనను కస్టడీలో ఉంచుకున్నా.. విచారించిందేమీ లేదని చెప్పారు. తన ఫోన్ కూడా వారి దగ్గరే ఉందని.. పార్టీకి ఎలా వెళ్లానో చెక్ చేసుకోమని కోర్టులో చెప్పారు ఆర్యన్.
This post was last modified on October 9, 2021 1:23 am
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…