మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ (మా) ఎన్నికల వ్యవహారం మునుపెన్నడూ లేని స్థాయిలో వేడెక్కి పోయింది. గత రెండు పర్యాయాలు కూడా ఎన్నికలు వాడి వేడిగానే సాగాయి కానీ.. ఈసారి ఉన్నంత తీవ్రత అయితే ఎప్పుడూ లేదు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. వారి మద్దతుదారులు మరీ ఈ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఎన్నికలు సమీపించేకొద్దీ ఇవి మరీ శ్రుతిమించిపోయాయి.
ఈ ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనపుడు.. అలాగే ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా చర్చనీయాంశంగా మారిన అంశం.. ప్రకాష్ రాజ్ స్థానికత. వేరే భాష, రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ తెలుగు సినీ నటుల కోసం ఏర్పాటు చేసుకున్న సంఘానికి అధ్యక్షుడు కావడం ఏంటన్నది కొందరి ప్రశ్న. తాజాగా రవిబాబు, రాజీవ్ కనకాల లాంటి వాళ్లు పరోక్షంగా ఈ విషయాన్ని బలంగా లేవనెత్తారు. ఈ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ వైపు నుంచి మెగా బ్రదర్ నాగబాబు కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘‘ప్రకాష్ రాజ్ స్థానికుడు కాదు అని ఎన్నిసార్లు అంటారు. ఆయన లోకల్ కానపుడు ‘మా’లో సభ్యత్వం ఎందుకు ఇచ్చారు? ఇక నుంచి తెలుగు వాళ్లే ‘మా’లో ఉండాలని రూల్ పెట్టండి. ‘మా’ నిబంధనల ప్రకారం నటులెవరైనా మెంబర్ కావచ్చు. ఎన్నికల్లో పోటీ కూడా చేయొచ్చు. ఒకప్పుడు ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలని పర భాషా నటీనటులపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు విష్ణు రూల్స్ మార్చేస్తాడా? తెలుగులో ఎంతో మంది పాన్ ఇండియా మూవీలు తీస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమాను ప్రపంచస్థాయి తీసుకెళ్దామని కొందరు చూస్తుంటే.. ‘నా ఇండస్ట్రీ, నేను, తెలుగువాళ్లే ఉండాలి’ అనే సంకుచిత మనస్తత్వం ఎందుకు? ఇక్కడ అతిథులు ఎవరూ లేరు.
ఒక రకంగా హైదరాబాద్‌లో ఉన్న మేమంతా ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లమే. ‘మీరెందుకు ఇక్కడ ఉన్నారు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ అనలేదే? మరి ‘మా’లో ఎందుకు ఈ ప్రశ్న తలెత్తుతోంది. లోకల్, నాన్‌లోకల్ అన్న భావన తనకు లేదని మొదట చెప్పింది నరేశ్. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పాడు. కానీ ఇప్పుడు మాస్క్ తీశాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగువారు లేరా అనడం ఎంత వరకు సమంజసం? ‘మా’ ఎన్నికల్లో మేమూ పోటీ చేయగలం. కానీ, మాకున్న పరిస్థితులు వేరు. ప్రకాశ్‌రాజ్ ఉత్సాహంతో ముందుకు వచ్చారు. ఆయనకు దేశమంటే అభిమానం ఉంది. ఆయనతో నాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అయితే, ఇద్దరం కోరుకునేది ‘మా’ సంక్షేమం’’ అని నాగబాబు అన్నాడు.
This post was last modified on October 8, 2021 10:14 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…