‘ఎఫ్2’తో కడుపుబ్బ నవ్వించిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత ‘గద్దలకొండ గణేష్’గా గడగడలాడించాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరాకి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ప్లాన్ మారింది. దసరాకి మిగతా వారికి దారిచ్చి, క్రిస్మస్ సీజన్‌లో సీటు రిజర్వ్ చేసుకున్నాడు గని. డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. బాక్సింగ్ రింగ్‌లో నిలబడి ఉన్నాడు గని. హోరాహోరీగా ఫైట్ చేసినట్లు ఒంటికి పట్టిన చెమటలు, నిప్పులు కురిపిస్తున్న కళ్లు చెబుతున్నాయి. అవతల ఎవరున్నారో తెలీదు కానీ, లాగిపెట్టి ఓ పెద్ద పంచ్ ఇచ్చాడు. అతని సిక్స్ ప్యాక్ బాడీ, బాక్సర్ లుక్ అంచనాలను పెంచుతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, కనీ వినీ ఎరుగని గని అంటూ వచ్చిన పాట కూడా హైలైట్ అయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’ కూడా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతోంది. తమ పాత్రల కోసం ఇద్దరు హీరోలు పూర్తిగా మేకవర్ అయ్యారు. ఫుల్లుగా ట్రైనింగ్ తీసుకుని మరీ రింగులోకి దిగారు. అయితే విజయ్ ఫస్ట్ లుక్ తప్ప ఇంతవరకు టీజర్ లాంటివేమీ రాలేదు. సినిమా కూడా వచ్చే యేడు సెకెండాఫ్‌లో రావొచ్చంటున్నారు. వరుణ్ మాత్రం కాస్త ముందుగానే ఆట మొదలెడుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌లో తనని పర్‌ఫెక్ట్ బాక్సర్‌లా చూసి అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద గని పంచ్ గట్టిగానే తగిలేలా ఉందని అంటున్నారు.
This post was last modified on October 7, 2021 10:36 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…