రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లందరూ చాలా వరకు ఔట్ స్పోకెన్‌గానే ఉంటారు. ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. కొంచెం బోల్డ్ కామెంట్సే చేస్తుంటారు. చివరగా వర్మ క్యాంపు నుంచి వచ్చి మంచి పేరు సంపాదించిన అజయ్ భూపతికి కొంచెం దూకుడు ఎక్కువన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా తన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 విడుదలకు ముందే ఈ సినిమా ఆడకుంటే ఊరుకెళ్లి గొర్రెలు మేపుకుంటా అంటూ ఒక కామెంట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడతను. ఇక ఆ చిత్రం రిలీజై బ్లాక్‌బస్టర్ అయ్యాక పలు సందర్భాల్లో తన మాటల దూకుడు చూపించాడు అజయ్.
తన రెండో సినిమా మహాసముద్రంలో నటించడానికి ముందు అంగీకరించి, తర్వాత హ్యాండ్ ఇచ్చిన ఒక స్టార్ హీరోనుద్దేశించి చీప్ స్టార్ అంటూ అప్పట్లో అజయ్ చేసిన కామెంట్ కూడా అప్పట్లో సంచలనం రేపింది.
ఇప్పుడు తన శైలిని కొనసాగిస్తూ అజయ్ భూపతి.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల మీద ఒక కామెంట్ చేశాడు. “ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’ లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన “మహాసముద్రం” రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి అని ట్వీట్ చేసి, తన సినిమా ఇంకో 8 రోజుల్లో రిలీజ్ కాబోతోందంటూ కౌంట్ డౌన్ వీడియోను షేర్ చేశాడు అజయ్.
“నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా… (అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు అజయ్. మా ఎన్నికల విషయంలో జరుగుతున్న రభస చూసి చాలామంది టాలీవుడ్లో చిరాకు పడుతున్నారు. ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఎన్నికల వ్యవహారం రసాభాసగా మారిపోయిందేంటా అని అసహనం చెందుతున్నారు. కానీ దీని గురించి ఓపెన్‌గా మాట్లాడలేక సైలెంటుగా ఉంటున్నారు. కానీ అజయ్ మాత్రం ఈ ఎన్నికల గురించి తనదైన కామెంట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
This post was last modified on October 7, 2021 6:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…