మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో విజయం సాధించడానికి కొందరు ఓటుకి పదివేలు చొప్పున ఇస్తున్నారని నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం నాడు ఆయన ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతుగా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ ఇండియన్ యాక్టర్ అని.. ఆయన తెలుగువాడు కాదని విమర్శించేవాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటారని ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ కూరలో ఉప్పులాంటి వారని.. ఆయన చిన్న సినిమా వాళ్లకు, పెద్ద సినిమా వాళ్లకు కావాలని.. నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాష్ రాజ్ ను అందరూ ఒప్పుకోవాల్సిందే అని అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తారని అసలు ఊహించలేదని.. అసోసియేషన్ కోసం సినిమాలు వదులుకుంటానని ఆయన తనతో చెప్పారని నాగబాబు అన్నారు. ఒక్కో సినిమాకి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకునే ఆయన అంత మొత్తనాని వదులుకొని ‘మా’ కోసం పని చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు.
కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ లాంటి వాళ్లు ప్రకాష్ రాజ్ ఎవరని ప్రశ్నిస్తున్నారని.. ఆయన అంటే అంత చులకనా..? అని ప్రశ్నించారు. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారని.. ఒక్కో ఓటరుకి రూ.10 వేలు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజుల తరువాత మరికొంత డబ్బు ఇస్తామని చెబుతున్నారని.. ‘మా’ అసోసియేషన్ మసకబారబోతుందని అన్నారు. సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కొంత కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా ఉంటేనే ‘మా’ బాగుపడుతుందని అన్నారు.
This post was last modified on October 6, 2021 6:24 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…