వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు సందిగ్ధత తప్పట్లేదు. ఈ పండక్కి ముందు అనుకున్న సినిమాలు వేరు. చివరికి రేసులో నిలుస్తున్న సినిమాలు వేరు. 2022 సంక్రాంతికి అనుకున్న ‘సర్కారు వారి పాట’ ఇప్పుడు పండుగ రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది. ఆ చిత్రం వేసవికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి కావడానికి సమయం పట్టేట్లుండటం.. పైగా విపరీతమైన పోటీ ఉండటంతో వేసవిలో సోలో రిలీజ్ బెటర్ అనే అభిప్రాయానికి చిత్ర బృందం వచ్చినట్లు కనిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ రేసులోకి వచ్చిన నేపథ్యంలో భీమ్లానాయక్, రాధేశ్యామ్ చిత్రాల విషయంలోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. ఆ రెండు చిత్రాల బృందాలు సంక్రాంతి రిలీజ్‌ను ధ్రువీకరించాయి. ముందు అనుకున్నట్లే జనవరి 12న భీమ్లా నాయక్, 14న రాధేశ్యామ్ రాబోతున్నాయి. వీటికంటే ముందు జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రావడం పక్కా అన్నట్లే. ఈ మూడు చిత్రాలకు బెర్తులు దాదాపు ఫిక్స్ అయినట్లే. ఇక మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేనట్లే.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’ను సంక్రాంతి బరిలోకి తీసుకురావడం పట్ల టాలీవుడ్లో అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నట్లు సమాచారం. మూడు పెద్ద సినిమాలు ఆల్రెడీ సంక్రాంతికి ఖరారైనట్లు తెలిశాక ‘ఆర్ఆర్ఆర్’ను జనవరి 7కు ఫిక్స్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయమై కొందరు నిర్మాతలు సమావేశమై ‘ఆర్ఆర్ఆర్’ టీం మీద ఆగ్రహం వ్యక్తం చేశారని, ఫిలిం చాంబర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఐతే సంక్రాంతికి వారం ముందే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బందేముందన్న వాదన ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ నుంచి వినిపిస్తోంది. వేసవి వరకు తమ చిత్రాన్ని ఆపే పరిస్థితి లేదని.. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమై వడ్డీల భారం భారీగా మోస్తున్నామని.. కాబట్టి డేట్ మార్చడానికి వీల్లేదని.. ఇంకోసారి రిలీజ్ డేట్ మారిస్తే ప్రేక్షకుల్లో చులకన అయిపోతామని ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ అంటున్నట్లు సమాచారం. కాబట్టి ఇప్పుడనుకుంటున్న లైనప్పే సంక్రాంతికి ఫిక్సయినట్లుగా భావించాల్సిందే.
This post was last modified on October 6, 2021 6:21 pm
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…