మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఇంకో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. కొన్ని రోజుల ముందు వరకు చూస్తే ప్రకాష్ రాజ్‌దే తిరుగులేని ఆధిపత్యంగా కనిపించింది. ఇండస్ట్రీపై తిరుగులేని పట్టున్న మెగా ఫ్యామిలీ అండ ఉండటం ఆయనకు అతి పెద్ద బలంగా కనిపించింది. నాన్ లోకల్ అనే చర్చ ఆయన పోటీలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పక్కకు వెళ్లిపోయింది.
‘మా’ అధ్యక్షుడైతే ఏం చేయాలనుకుంటున్నానో చక్కటి ప్రణాళికతో ప్రకాష్ రాజ్ సభ్యులకు వివరించడం, ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే జోరుగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయన రేసులో ముందు నిలిచారు. దీంతో మంచు విష్ణు బాగా వెనుకబడ్డట్లే కనిపించింది. అతడి పోటీ నామమాత్రం అని తేల్చేసిన వాళ్లూ ఉన్నారు. ఇంటర్నెట్లో పోల్స్ పెడితే ప్రకాష్ రాజ్‌దే పూర్తి పైచేయిగా కనిపించింది. మంచు విష్ణు అసలు రేసులోనే లేనట్లు కనిపించాడు.
కానీ ఎన్నికలు దగ్గర పడేసరికి మంచు విష్ణు బలం పెంచుకున్నట్లే కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో విష్ణు అక్రమాలకు పాల్పడ్డాడని ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేయగా.. విష్ణు దానికి దీటుగానే బదులిచ్చాడు. అతను నిబంధనల్ని ఉల్లంఘించాడా లేదా అన్నది పక్కన పెడితే.. తన టీంతో సీనియర్ మెంబర్లతో టచ్‌లోకి వెళ్లడం ద్వారా వారి దృష్టిని బాగానే ఆకర్షించినట్లు కనిపిస్తోంది. చివరికి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని ఎన్నికల అధికారి నిర్ణయించిన నేపథ్యంలో ఇది విష్ణుకు కలిసొచ్చేలా కనిపిస్తోంది.
ఈ విషయంలో అభిప్రాయం కోసం ఎన్నికల అధికారి కృష్ణం రాజుకు ఫోన్ చేస్తే.. మంచు విష్ణు కోరుకుంటున్న బ్యాలెట్ పద్ధతికే ఆయన ఓటు వేయడాన్ని బట్టి రెబల్ స్టార్ మంచు హీరో వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజా రవిబాబు మీడియాకు రిలీజ్ చేసిన వీడియో సందేశాన్ని బట్టి చూస్తే అతను మంచు విష్ణుకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది. లోకల్-నాన్ లోకల్ చర్చ లేదంటూనే ప్రకాష్ రాజ్ పట్ల వ్యతిరేక స్వరాన్ని బలంగానే వినిపించాడు రవిబాబు. సోషల్ మీడియాలో పోల్స్‌లో పాల్గొనే వాళ్లు ‘మా’ ఎన్నికల్లో పాల్గొనరన్న విషయం గమనార్హం. మొత్తంగా ఎన్నికల్లో పడేదే ఐదారొందల ఓట్లకు మించి ఉండవన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికలు దగ్గరపడే సరికి విష్ణు తెలివిగా నరుక్కొస్తూ బలం పెంచుకుంటున్నట్లే కనిపిస్తోంది. అతను గెలిచేస్తాడని కాదు కానీ.. ప్రకాష్ రాజ్‌కు గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం. ఏమో ఎన్నికల్లో గెలిచినా గెలిచేస్తాడేమో ఎవరికి తెలుసు?
This post was last modified on October 6, 2021 3:10 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…