రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటించగానే అప్పటికే సంక్రాంతి రేస్‌లో ఉన్న రాధేశ్యామ్, భీమ్లానాయక్, సర్కారువారి పాట సినిమాల విడుదలపై సందేహాలు మొదలయ్యాయి. అంత భారీ ప్యాన్ ఇండియా సినిమా బాక్సాఫీసును ఆక్యుపై చేస్తే ఈ సినిమాలు రావడం ఎలా కుదురుతుంది, కచ్చితంగా రిలీజ్ వాయిదా పడుతుంది అనుకున్నారంతా. మిగతావారి సంగతేమో కానీ ‘బీమ్లానాయక్’ తగ్గేలా లేడు. సంక్రాంతికి రావడం పక్కా అంటున్నాడు.
ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ సోలో సాంగ్‌ని ఆల్రెడీ రిలీజ్ చేసింది టీమ్. ఇప్పుడు రెండో పాట రెడీ అయ్యింది. పవన్, నిత్యలపై సాగే ‘అంత ఇష్టం’ అనే ఈ పాటని దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్టే జనవరి 12న రాబోతున్నట్లు ఈ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు.. రానాకి జోడీగా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా సంక్రాంతి రిలీజ్‌ని నిర్ధారించి చెప్పింది. ఈ అమ్మాయి ఇందులో యాక్ట్ చేస్తున్నట్లు ఇంతవరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే తనే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం, రానాకి జంటగా నటించడం చాలా ఆనందంగా ఉందని, తెలుగులో ఇంత మంచి డెబ్యూ దొరకడం తన అదృష్టమని చెప్పిన సంయుక్త.. సంక్రాంతికి సందడి మామూలుగా ఉండదని చెప్పింది. దాంతో భీమ్లానాయక్ సంక్రాంతి బరిలోనే ఉండటానికి డిసైడయ్యాడని కన్‌ఫర్మ్ అయ్యింది.
This post was last modified on October 6, 2021 11:44 am
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…