చిరంజీవి సినిమాకి సంబంధించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘గాడ్‌ఫాదర్’మూవీ గురించిన ఓ వార్త కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి తల్లిగా గంగవ్వ నటించబోతోందనేదే ఆ న్యూస్. ఈ పాత్రకి స్వయంగా మెగాస్టారే ఆమె పేరును సూచించారట. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ, బిగ్‌బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. సినిమాల్లో అడుగు పెట్టింది. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. రాజరాజ చోర, లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రాల్లో కనిపించింది. మరికొన్ని అవకాశాలు కూడా చేతిలో ఉన్నాయి. ఈమధ్య టీవీ షోస్‌లోనూ తెగ సందడి చేస్తోంది. కాబట్టి చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే ‘గాడ్‌ఫాదర్’ అనేది మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్. ఒరిజినల్‌లో మోహన్ లాల్ తల్లి పాత్ర అసలు ఉండనే ఉండదు. మరి గంగవ్వను తీసుకోవడమేంటి అనేది పెద్ద డౌట్. దర్శకుడు మోహన్ రాజా ఈ స్క్రిప్ట్‌ని మన నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టు మార్చేశాడని, ఒరిజినల్‌లో లేని హీరోయిన్ క్యారెక్టర్‌ని యాడ్ చేశారని, ఆ పాత్ర అనుష్క చేయబోతోందని..ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆయన తల్లి పాత్రని కూడా యాడ్ చేసి ఉండొచ్చు.
లేదంటే ఒరిజినల్‌లో ఉన్న ఓ ముసలావిడ పాత్రయినా గంగవ్వ చేస్తుండాలి. మోహన్‌లాల్ ఓ ఆశ్రమాన్ని నడుపుతుంటారు. అక్కడున్న వారందరికీ ఓ పెద్దావిడ సర్వీస్ చేస్తూ ఉంటుంది. యమా యాక్టివ్‌గా ఉండే పాత్ర. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. హీరోకి కష్టమొస్తే తట్టుకోలేదామె. ఒకవేళ ఆ పాత్రకి గంగవ్వని తీసుకుంటే తల్లి పాత్ర అని అందరూ అపోహ పడుతున్నారా అనే డౌట్ కూడా ఉంది. ఏదేమైనా, పాత్ర ఏదైనా.. చిరంజీవి సినిమాలో చోటు దొరికివుంటే మాత్రం గంగవ్వ పంట పండినట్టే.
This post was last modified on October 5, 2021 10:17 am
పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…