ఒకప్పుడు తమ ఫేవరేట్ స్టార్ సినిమా ఎప్పుడు థియేటర్‌కి వస్తుందా అని చూసేవారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు తమ స్టార్ సినిమా సింగిల్‌గా రావడం కుదురుతుందా లేదా అని ఆలోచించాల్సి వస్తోంది. కరోనా వల్ల మూతబడిన థియేటర్లు తెరుచుకోగానే, వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజుకి రెడీ అయిపోయాయి. ఒకరి తర్వాత ఒకరుగా ఖర్చీఫులు వేసుకుంటూ పోవడంతో కొన్ని సినిమాలకి శ్లాట్ దొరకనట్టుగా అయ్యింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆచార్య, అఖండ చిత్రాల గురించి.
అందరూ తమ రిలీజ్ డేట్స్ ప్రకటించినా ఈ రెండు సినిమాల మేకర్స్ మాత్రం ఇంతవరకు అనౌన్స్మెంట్‌తో రాలేదు. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప’ని కాస్త ముందుకు లాక్కొచ్చి ‘ఆచార్య’కి క్రిస్మస్ రేస్‌లో చోటిచ్చాడు. రేపో మాపో ప్రకటన రావొచ్చు. ఇక మిగిలింది ‘అఖండ’. రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఎక్స్‌పెక్టేషన్స్‌తో పాటు ఎదురు చూపులూ భారీగానే ఉన్నాయి. అందుకే సంక్రాంతి పండక్కి ఫీస్ట్ ఇద్దామని ఫిక్సయ్యారు టీమ్. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాటు భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారువారి పాట రేస్‌కి రెడీ అయిపోవడంతో అఖండకి వెనక్కి తగ్గక తప్పలేదు.
ఇక మిగిలింది దీపావళి. ఆ సమయంలో భారీ చిత్రాలేవీ రావడం లేదు. రజినీకాంత్ ‘అన్నాత్తే’ ఉంది కానీ, టాలీవుడ్ మార్కెట్‌ని రజినీ సినిమా కబ్జా చేస్తుందని భయపడే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇక వరుణ్ తేజ్ ‘గని’ కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అంటే ఏవో ఒకట్రెండు మీడియమ్ రేంజ్ సినిమాలు తప్ప బిగ్ మూవీసేవీ లేవు. సో, బాలయ్య నిక్షేపంగా దీపావళికి వచ్చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక మిస్సయితే మళ్లీ ఉగాది వరకు ఆయనకు చాన్స్ దొరకదు. కాబట్టి ఈ వీకెండ్ లోపు ఈ విషయం తేల్చేస్తారని, దివాలీ రిలీజ్‌ని అనౌన్స్ చేస్తారని అంచనా. చూడాలి మరి మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో!
This post was last modified on October 4, 2021 2:21 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…