Movie News

షారుఖ్‌కి షాక్.. చేతులారా చేసుకున్నదేనా!

ఏ తండ్రి అయినా కొడుకు తనను మించి ప్రయోజకుడు కావాలని కోరుకుంటాడు. షారుఖ్ ఖాన్ కూడా అలానే కోరుకుని ఉంటాడు. బాలీవుడ్‌ బాద్‌షాగా వెలిగిన తన లెగసీని తన కొడుకు ఆర్యన్ కంటిన్యూ చేస్తాడని ఆశపడి ఉంటాడు. కానీ తనకి ఊహించని షాక్ తగిలింది. డ్రగ్స్ కేసులో కొడుకు అరెస్టైతే చూడాల్సి వచ్చింది.

అయితే ఇదంతా చేతులారా చేసుకున్నదే అంటున్నారు కొందరు. అనడమే కాదు.. పాత ఇంటర్వ్యూల్లో షారుఖ్ తన కొడుకు గురించి అన్న మాటల్ని వైరల్ కూడా చేస్తున్నారు. సిమీ గరేవాల్‌ చేసిన ఇంటర్వ్యూ వీడియో అది. పిల్లల గురించి టాపిక్ వచ్చినప్పుడు ఓ ఊహించని డైలాగ్ కొట్టాడు షారుఖ్. ‘నువ్వుఅమ్మాయిల వెంట పడొచ్చు. స్మోక్ చేయొచ్చు. డ్రగ్స్ కావాలంటే తీసుకోవచ్చు. సెక్స్ కూడా చేయొచ్చు అని నాలుగేళ్ల వయసున్నప్పుడే నేను నా కొడుక్కి చెప్పేశాను’ అని షారుఖ్ అంటుంటే, నాలుగు కాదు రెండేళ్లప్పుడు అని అతని భార్య కరెక్ట్ చేసింది.

నిజానికి ఇవి షారుఖ్ దంపతులు సరదాగా అన్న మాటలు. నేను వయసులో ఉన్నప్పుడు చేయలేకపోయినవన్నీ నువ్వు చెయ్యి అని నా కొడుక్కి చెప్పాననే క్రమంలో చెప్పాడు షారుఖ్. కానీ తన కొడుకు వాటిని నిజం చేస్తాడని ఆయన ఊహించి ఉండడు. పిల్లలకు షారుఖ్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాడని, అందుకే ఆయన కొడుకు, కూతురు కూడా ఎప్పుడూ పార్టీలంటూ టైమ్ పాస్ చేస్తుంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు.

నిజానికి ఇది షారుఖ్ ఒక్కడి సమస్యే కాదు. బీటౌన్‌లో చాలామంది స్టార్స్‌తో పాటు స్టార్ కిడ్స్‌ కూడా డ్రగ్స్‌కి అలవాటు పడ్డారనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. దొరికే వరకు ఏ దొంగయినా దొరే అన్నట్టుగా ఉంటుంది బాలీవుడ్ పరిస్థితి. అక్కడ డ్రగ్స్ నీళ్లలా పారతాయనేది అందరికీ తెలిసిన నిజమే. సుశాంత్ సింగర్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత డ్రగ్స్ దందా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎన్‌సీబీ బాగా యాక్టివ్ కావడంతో కాస్త కంట్రోల్ అవుతున్నట్టే కనిపించింది. కానీ టాప్ స్టార్‌‌ కొడుకే ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టవడంతో అసలు బాలీవుడ్ ఎటు పోతోంది అంటున్నారంతా.

This post was last modified on October 4, 2021 1:57 pm

Share

Recent Posts

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

27 minutes ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

35 minutes ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 hours ago