రాజమౌళి సినిమా అంటే తెలుగువారికే కాదు.. మన దేశంలోని ప్రతి ప్రేక్షకుడికీ ఆసక్తే. పైగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా ప్లాన్ చేశాడు. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం అందరూ క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు. భారీ చిత్రాలన్నీ థియేటర్ల దగ్గర ఖర్చీఫులు వేస్తున్నా, జక్కన్న మాత్రం ఉలకకుండా పలకకుండా ఉన్నాడేంటబ్బా అని కూడా అనుకున్నారు. ఎట్టకేలకి ‘ఆర్‌ఆర్ఆర్’ రిలీజ్‌కి రాజమౌళి ముహూర్తం పెట్టాడు. మిగతా దర్శక నిర్మాతలందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.
వచ్చే జనవరి 7న తన సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇప్పటికే సంక్రాంతి సీజన్‌లో రావడానికి సర్కారువారి పాట, భీమ్లానాయక్, రాధేశ్యామ్ చిత్రాలు రెడీగా ఉన్నాయి. సరిగ్గా వారం ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాబోతోంది. అంటే ఈ సినిమాలు వచ్చేసరికి థియటర్స్ అన్నింటినీ జక్కన్న సినిమా ఆక్యుపై చేసి ఉంటుంది. మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటి! అయినా సందు చూసుకుని వచ్చినా.. పోటీ మామూలుగా ఉండదు. ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్‌ల సినిమాలు ఒకేసారి వస్తే ఎలా అని ఆలోచిస్తున్నవారిని మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్.
మరోవైపు ఆలియా భట్‌కి కూడా ఇది షాకే. బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఆమె నటించిన ‘గంగూబాయ్ కథియావాడి’ ఒకటి. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు జనవరి 6న రావడానికి రెడీ అయ్యిందీ సినిమా. ఆ తర్వాతి రోజే ‘ఆర్‌ఆర్‌ఆర్’ వస్తే ఆమె సినిమాలే ఒకదానితో ఒకటి పోటీపడే పరిస్థితి. బాలీవుడ్ కదా, ఆలియాకే డిమాండ్ ఉంటుంది అనుకోడానికి లేదు. ఎందుకంటే అది రాజమౌళి సినిమా. ఇప్పటికే బాలీవుడ్‌లో ఆయన సినిమాకి చాలా ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ‘గంగూబాయ్’కి గట్టి పోటీనే ఉంటుంది.
ఇంకో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఆర్‌ఆర్‌ఆర్, గంగూబాయి, ఈ రెండు చిత్రాలనూ పెన్ స్టూడియోస్ సంస్థే రిలీజ్ చేస్తోంది. అదీ ప్యాన్ ఇండియా స్థాయిలో. మొత్తానికి రాజమౌళి తీసుకున్న ఒక్క నిర్ణయం బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధానికే తెర తీసింది. మరి ఆ టైమ్ వచ్చేసరికి ఎంతమంది మొండిగా బరిలోకి దిగుతారో, ఎంతమంది తర్వాత చూద్దాంలే అని తగ్గుతారో!
This post was last modified on October 2, 2021 7:12 pm
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…